వాటిని చూసి ఎలా చేసిందాని ఆశ్చర్యపోయా

0

తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా వచ్చిన ఆఫర్లు.. సక్సెస్ ల కంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఎక్కువ సక్సెస్ లను జ్యోతిక దక్కించుకుంటుంది. తాజాగా ఈమె ‘జాక్ పాట్’ చిత్రాన్ని చేసింది. కళ్యాణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్వయంగా సూర్య తన 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించాడు. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సూర్య మాట్లాడుతూ.. ఒక పాత్రకు కావాల్సిన విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 100 శాంతం కాదు ఏకంగా 200 శాతం ఎఫర్ట్ పెట్టే నటి జ్యోతిక. ఈ చిత్రం కోసం కర్రసామును ఏకంగా ఆరు నెలల పాటు కష్టపడి నేర్చుకుంది. చాలా ఆలోచించి కథలను ఎంపిక చేసుకోవడంతో పాటు.. ఎంపిక చేసుకున్న కథలకు మరియు పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు కష్టపడుతుంది. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసిన సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత కష్టమైన సీన్స్ ను ఎలా చేసి ఉంటుందనిపించింది. జ్యోతిక నుండి చాలా నేర్చుకున్నాను. జ్యోతిక నా జాక్ పాట్ అన్నాడు.

జ్యోతిక మాట్లాడుతూ.. ఇది చాలా విభిన్నమైన చిత్రం. ఇప్పటి వరకు ఇలాంటి కథతో నేను నటించలేదు. మహిళలకు పవర్ కావాలి. ఆ పవర్ ఈ పాటల్లో సినిమాలో ఉంది. దర్శకుడు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ఆయన అన్ని సీన్స్ ను కూడా జాగ్రత్తగా ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం మావారు సలహాలు ఇచ్చారు. చాలా కిట్స్ కూడా కొనిచ్చారు. నాకు మా ఆయనే జాక్ పాట్ అంది.
Please Read Disclaimer