ఆ హక్కు నాకుందంటున్న స్టార్ హీరో!

0

తమిళం తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న సూర్య గత కొన్ని రోజులుగా ఒక విషయంలో వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. సూర్య ఫ్యామిలీ అగరం పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలువురు విద్యార్థులకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. తాజాగా ఒక విద్యార్థుల కార్యక్రమంలో హాజరు అయిన సూర్య కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిర్ణయంతో ‘నీట్’ రాసే సౌత్ విద్యార్థులు నష్టపోతున్నారు అంటూ విమర్శలు చేశాడు.

సూర్య విమర్శలను కొందరు తప్పుబడుతున్నారు. విద్య గురించి.. విద్య విధానం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అంటూ కామెంట్స్ చేశారు. అసలు ఈ విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యపై రాజకీయంగా కూడా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఒక పార్టీకి చెందిన నాయకులు సూర్యను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.

తనపై వస్తున్న విమర్శలకు సూర్య స్పందిస్తూ… తనకు మాట్లాడే అర్హత లేదు అంటూ అనడం హాస్యాస్పదంగా ఉంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. ఒక ఇండియన్ గా నాకు అన్ని విషయాల గురించి స్పందించే హక్కుందని సూర్య అన్నాడు. సమాజం గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలోని సమస్యలను గురించి స్పందించే హక్కుంది. నేను విద్యార్థుల గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది. ఈ విషయంలో తాను ఇక ముందు కూడా మాట్లాడుతూనే ఉంటానంటూ సూర్య ప్రకటించాడు. తనను ఎవరు అడ్డుకోలేరంటూ వారిని హెచ్చరించాడు.
Please Read Disclaimer