సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

#RRR : ప్రేక్షకులకు సర్ ప్రైజ్ రెడీ

0

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో పాటు అజయ్ దేవగన్ ఇంకా ముఖ్య తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కాని.. మేకింగ్ వీడియో కాని.. ఏదైనా పాత్రకు సంబంధించి ప్రోమో కాని ఏమీ విడుదల కాలేదు. దాంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా ఆర్ఆర్ఆర్ నుండి ఏదో ఒక అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రేక్షకుల ఓపికను మరీ పరీక్షించకుండా ఒక వీడియోను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి తనయుడు ఆ వీడియోను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ పాట కోసం ఆలియా భట్ పై ప్రత్యేకంగా కొన్ని షాట్స్ ను చిత్రీకరించారట. ఇటీవలే షూట్ పూర్తి చేసుకోవడంతో వీడియోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వీడియో కు ప్రత్యేకంగా కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ వీడియో లో చరణ్.. ఎన్టీఆర్ ల లుక్స్ రివీల్ అవుతాయా లేదా తెలియదు. కాని ఈ వీడియో మాత్రం అతి త్వరలోనే ఏదో ఒక ప్రత్యేక సందర్బంలో విడుదల చేయబోతున్నారు. ఆ ప్రత్యేక సందర్బం ఖచ్చితం గా ఈనెలలోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer