సూపర్ స్టార్ కి సర్ ప్రైజ్ లంచ్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మునుపటి తరం హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. అప్పట్లో కృష్ణకు జోడీగా విజయశాంతి నటించిన సమయంలో మహేష్ బాబు బాలనటుడు. దీంతో ఇప్పుడు మహేష్ బాబు – విజయశాంతి కాంబినేషన్ సీన్లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే మహేష్ బాబు విజయశాంతిని ఎంతో గౌరవిస్తారు. ఈ విషయం విజయశాంతి గారు ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. మహేష్ సెట్ లో తనను మేడమ్ అని.. అమ్మా అని పిలుస్తారని చెప్పారు. ఇక విజయశాంతి మహేష్ ను ‘బాబు’ అని పిలుస్తారని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు కోసం విజయశాంతి తన ఇంటి నుంచి షూటింగ్ లొకేషన్ కు స్పెషల్ లంచ్ తెప్పించారట. అందులో మహేష్ కు ఇష్టమైన డిషెస్ ఉన్నాయని.. మహేష్ ఈ సర్ ప్రైజ్ లంచ్ తో థ్రిల్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా షూటింగ్ లొకేషన్ లో ఇలాంటి అందమైన వాతావరణం ఉండడం అవుట్ పుట్ పై ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని భావించవచ్చు.

‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘F2’ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలం గ్యాప్ తర్వాత మహేష్ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది.
Please Read Disclaimer