ఇండియన్ బదులుగా సూర్య ఎంట్రీ ?

0

2.0 ఇచ్చిన షాక్ తో కొంత కాలం సైలెంట్ గా ఉన్న దర్శకుడు శంకర్ ఆ తర్వాత భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2 అంటూ కొంత హడావిడి చేశాడు కానీ ఆ తర్వాత సదరు యూనిట్ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఓపెనింగ్ చేశాక కొంత షూటింగ్ జరిగిందన్న టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత ఆగిపోయిన మాట నిజం. లైకా సంస్థ శంకర్ నుంచి బడ్జెట్ కు సంబంధించి అగ్రిమెంట్ అడిగిందని అందుకే జాప్యం జరుగుతోందని చెన్నై మీడియా టాక్ బలంగా వినిపించింది.

దీని సంగతేమో కానీ ఇప్పుడీ ఇండియన్ 2 కన్నా ముందుగా శంకర్ దర్శకత్వంలోనే మీడియం బడ్జెట్ తో సూర్య హీరోగా ఓ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట. హరీష్ జైరాజ్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు వినికిడి. ఈ కాంబోలో గతంలో వచ్చిన అపరిచితుడు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఇప్పుడు మళ్ళి ఈ కాంబినేషన్ రిపీట్ అంటే ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ వస్తుంది. అయితే హటాత్తుగా శంకర్ దీనికెలా ఒప్పుకున్నాడు అనే డౌట్ వస్తోంది కదా.

2.0 లో వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకే లైకా సూర్య సినిమాను ఒప్పందంలో భాగంగా లైన్ లో పెడుతోందని కోలీవుడ్ మాట. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. లైకాలోనే సూర్య ఇప్పుడు కాప్పన్ చేశాడు. విడుదలకు రెడీగా ఉంది. దీన్నే బందోబస్త్ గా తెలుగులో డబ్ చేశారు. దీన్ని ఒప్పుకునే టైంలోనే లైకాకు మరో సినిమా చేస్తానని సూర్య మాట ఇచ్చాడట. సో ఉభయకుశలోపరిగా శంకర్ – సూర్య లను కాంబోగా సెట్ చేస్తున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
Please Read Disclaimer