బిబి4 : హారికపై పెద్ద నింద వేసి వెళ్లిపోయిన సూర్యకిరణ్

0

బిగ్ బాస్ సీజన్ 4 మొదటి సండే సందడి సందడిగా సాగింది. చివర్లో ఎలిమినేషన్ సమయంలో కాస్త షో ఎమోషనల్ అయ్యింది. మొదట అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలుగా డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ మరియు నాగార్జునలు జడ్జ్ లుగా వ్యవహరించి మార్కులు ఇచ్చారు. మూడు మార్కుల తేడాతో అమ్మాయిల టీం గెలిచింది. ఆ తర్వాత కనెక్షన్ లో ఉన్న వారు ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయమై రైమ్స్ ఇచ్చి డ్రాయింగ్ చేయమని మరోకరిని గెస్ చేయమని సూచించారు. సూర్య కిరణ్ కు మోనాల్ తో మంచి నీళ్లు ఇప్పించి మరీ ఎలిమినేట్ చేయడం జరిగింది.

మోనాల్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రశ్నించగా సూర్యకిరణ్ గారు అంటూ అనుమానంగానే ఆమె అంది. ఆ వెంటనే మరెందుకు ఆసల్యం ఆ మంచి నీళ్లు ఇచ్చి సూర్య కిరణ్ ను బయటకు పంపించేయి.. సూర్య కిరణ్ నీవు ఎలిమినేట్ అయ్యావు అంటూ నాగార్జున ప్రకటించాడు. అక్కడ సెల్ఫీ తీసుకుని నాగార్జు వద్దకు స్టేజ్ పైకి వచ్చాడు. వెళ్లి పోయే ముందు సూర్యకిరణ్ ఇంటి సభ్యులందరి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈసారి విభిన్నంగా కొన్ని జంతువులు ఇచ్చి వాటికి ఇంట్లో వారితో మ్యాచ్ చేయాల్సిందిగా టాస్క్ ఇచ్చారు. చాలా మందికి కూడా సూర్య కిరణ్ పాజిటివ్ గా స్పందించారు. జంతువులతో పోల్చినా కూడా సూర్య కిరణ్ ఒక్కరు ఇద్దరి విషయంలో తప్ప అందరి విషయంలో కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు.

గంగవ్వను చీమతో దేవిని మొసలితో సోహెల్ ను ఎలుకతో అభిజిత్ను పిల్లితో దివిని తాబేలుతో కళ్యాణిని కోతితో మెహబూబ్ ను గద్దతో హారికను పాముతో సుజాతను కుక్కతో సోహెల్ ను నక్కతో లాస్యను గాడిదతో అరియానాను గుడ్లగూబతో అఖిల్ను దున్నపోతుతో చివరకు అమ్మ రాజశేఖర్ ను సింహంతో పోల్చాడు. అందరికి కూడా పాజిటివ్ గానే స్పందించాడు. అయితే హారికను మాత్రం పాముతో పోల్చిన సమయంలో సూర్యకిరణ్ కాస్త ఆమెపై ఆగ్రహంతో ఉన్నట్లుగా అనిపించింది. ఆమెలో విషం ఉన్నట్లుగా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో నాగార్జున కల్పించుకుని నా పేరు అదే నా చేతిపై నాగుపాము ఉంటుంది. బాధ పడాల్సిన అవసరం లేదు అంటూ ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నిచాడు.