టీవీ నటుడికి కరోనా.. సీరియల్స్ బంద్!?

0

మహమ్మారీ కల్లోలం ఆషామాషీగా లేదు. దేశాధ్యక్షులు .. సినీసెలబ్రిటీలు.. సామాన్యులు అనే భేధం వైరస్ కి లేదు. అందరినీ చుట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో సైలెంట్ గా టీవీ సీరియళ్ల షూటింగులు సాగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అన్న వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ కంగారు పడింది.

నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇప్పటికే మహమ్మారీకి చికిత్స తీసుకుంటున్నాడు. మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అంటూ టీవీ యాంకర్ రవి బాంబ్ పేల్చాడు. ఒక యువనటుడు ఫామ్ హౌస్ లో క్వారంటైన్ కి వెళ్లాడని ప్రచారమవుతోంది. ఈ వార్తల నడుమ అసలేం జరుగుతోందా? అన్న కంగారు మొదలైంది. ఇలా అయితే షూటింగులకు వెళ్లాలంటే ఎలా? అన్న సందిగ్ధత హీరోల్లోనూ వ్యక్తమవుతోంది.

తాజాగా టీవీ సీరియల్స్ నటుడు ఒకరు కరోనా బారిన పడ్డారు అన్న వార్తతో మరింతగా కంగారు మొదలైంది. ప్రముఖ టీవీ నటుడు అంటూ నిన్న సాగిన ప్రచారంలో ప్రభాకర్ పేరు బయటికి వినిపించింది. జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ సహా వేరొక సీరియల్ లోనూ ఆయన నటిస్తున్నారని తెలిసింది. దీంతో ఒక్క సారిగా బుల్లితెర లోకం ఉలిక్కి పడింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కి వచ్చిన సదరు నటుడికి సెట్స్ లో జ్వరం కనిపించడం తో టెస్ట్ చేయించారు. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడం తో యూనిట్ సభ్యులంతా ఖంగు తిన్నారు. వెంటనే అందరినీ క్వారంటైన్ కి పంపించారు. తాజా ఉదంతం తో ఇకపై టీవీ సీరియళ్ల షూటింగులు ఆపేయాలన్న డిమాండ్ ఉపందుకుంది. నిర్మాతల తో మాట్లాడి ప్రస్తుతం ఆయా సీరియళ్ల షూటింగులు ఆపేయాలని టీవీ ఆర్టిస్టుల సంఘం డిమాండ్ చేస్తోందట.
Please Read Disclaimer