సుశాంత్ మరో షారుఖ్ అవుతాడనుకున్నా: కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

0

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడం దేశ సినీ రాజకీయ క్రీడా రంగాలను కుదిపేసింది. బాలీవుడ్ లోని లొసుగులు మాఫియా సంగతులు వెలుగుచూశాయి. దీంతో తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హీరో సుశాంత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బీహార్ లోని పాట్నా వెళ్లి సుశాంత్ ఫ్యామిలీకి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుశాంత్ మృతి గురించి విషయాలు తెలుసుకున్నారు. నేనూ సుశాంత్ పాట్నాకు చెందిన వారిమేనని.. నా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను కలిసి మాట్లాడాడని.. కానీ ఇలా జీవితాన్ని ముగిస్తాడని అనుకోలేదని రవిశంకర్ వాపోయాడు.

ఎంతో ప్రతిభావంతుడైన నటుడు ఇలా అర్ధాంతరంగా ముగించడం బాధాకరమని.. తన టాలెంట్ కు ఇంకా ఎంతో సాధించాల్సి ఉండేదని రవిశంకర్ తెలిపారు. భవిష్యత్తులో సుశాంత్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అంత ఎత్తుకు ఎదుగుతావని అనుకున్నానని..ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా విషాదానికి గురిచేసిందని సందేశంలో పేర్కొన్నారు.
Please Read Disclaimer