హీరోగా సినిమాలు లేకున్నా బ్రాండ్ అంబాసిడర్ గా..!

0

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన సుశాంత్ చేసిన సినిమాల్లో సక్సెస్ శాతం చాలా తక్కువే. కొన్ని సక్సెస్ అయినా వాటిని క్యాష్ చేసుకోవడంలో ఈ అక్కినేని హీరో విఫలం అయ్యాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. హీరోగా వరుసగా నిరాశే మిగులుతున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో కీలక పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడు. సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆ సినిమాలో నటించినందుకు సుశాంత్ కు ఏమైనా ప్రయోజనం దక్కిందా అంటే దక్కిందనే ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అల వైకుంఠపురంలో సినిమా విడుదల తర్వాత సుశాంత్ కు ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ స్ప్రైట్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సమ్మర్ ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో సదరు కంపెనీ వారు కొత్త యాడ్ ను చిత్రీకరించేందుకు సిద్దం అయ్యింది.

తెలుగులో సుశాంత్ ఈ యాడ్ లో నటించనుండగా తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ యాడ్ లో నటిస్తున్నాడట. ఇక హిందీలో ఆయుష్మాన్ ఖురానా ఆ యాడ్ ను చేయబోతున్నట్లుగా కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలుగులో ఎంతో మంది స్టార్స్ ఉండగా సుశాంత్ కు ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ యాడ్ తో లక్ వచ్చి అయినా సుశాంత్ మళ్లీ హీరోగా సినిమాలు చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-