తండ్రితో సుశాంత్ చివరి మాటలు వైరల్

0

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య నుండి ఆయన కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ వర్గాల వారు మరియు ఫ్యాన్స్ ఇంకా తేరుకోవడం లేదు. దాదాపు పది రోజులు అయినా కూడా ఆయన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటూ ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. కొడుకు ఫొటో ముందు చాలా విచార వదనంతో కూర్చుని ఉన్న కేకే సింగ్ మాట్లాడిన మాటలు కూడా అందరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

కేకే సింగ్ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ… సుశాంత్ చివరి సారిగా నాకు ఫోన్ చేసిన సమయంలో పెళ్లి గురించి మాట్లాడాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందంటూ మాట్లాడాడు అంటూ కేకే సింగ్ పేర్కొన్నారు. రియా చక్రవర్తితో ప్రేమ విషయమై మీకు ఏమైనా చెప్పాడా అంటూ రిపోర్టర్ అడిగిన సమయంలో స్పందిస్తూ ఆ విషయంలో నాకు ఎప్పుడు చెప్పలేదు. ఆ విషయం గురించి నాకు ఎలాంటి సమాచారం లేదని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ అన్నాడు.

రియా చక్రవర్తినే వచ్చే ఏడాది సుశాంత్ రాజ్ పూత్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని కాని ఆమెతో కూడా ప్రేమ విఫలం అయ్యిందేమో అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది సుశాంత్ ఎప్పటికి తెలియకుండా నిజాన్ని తనతో తీసుకు వెళ్లాడు.
Please Read Disclaimer