బన్నీ సెట్స్ సూపర్ కూలంటున్న హీరో

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా మీద అంచనాలు మాములుగా లేవు. ఏడాదిన్నర తర్వాత బన్నీ చేస్తున్న మూవీ కాబట్టి హైప్ కూడా అదే స్థాయిలో ఉంది. షూటింగ్ రెగ్యులర్ గా సాగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి మొదటి కర్చీఫ్ ని వేసింది. దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇందులో నటిస్తున్న మరో యూత్ హీరో సుశాంత్ షేర్ చేశాడు.

ఇప్పటిదాకా తాను చూసిన వాటిలో ఇదే సరదాగా అనిపిస్తున్న కూలెస్ట్ సెట్ అని ప్రతి చోటా పాజిటివ్ వైబ్రేషన్స్ తో వర్క్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. ఇంకేముంది ఇది చూసిన బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీ. ఫామిలీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఫ్యాన్స్ కు కావలసిన అంశాలన్నీ జోడించి పక్కా పైసా వసూల్ మూవీగా అన్ని వర్గాలను ఆకట్టుకునెలా త్రివిక్రమ్ దీన్ని తీర్చిదిద్దుతున్నారని ఇప్పటికే టాక్ ఉంది

ఇప్పుడు సుశాంత్ చెప్పిన మాటలతో ఇంకొంచెం జోష్ యాడ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇటీవలే టబు ఎంట్రీకి సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన యూనిట్ వచ్చే అక్టోబర్ నుంచి రెగ్యులర్ ప్రమోషన్ ప్లాన్ చేసే పనిలో ఉంది. సైరా విడుదలయ్యాక క్లారిటీ వచ్చేస్తుంది. సుశాంత్ తో పాటు నవదీప్ రోల్స్ ఎలా ఉంటాయనే దాని మీద ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరిగింది. సుశాంత్ చెప్పడాన్ని బట్టి చూస్తే లెన్త్ పరంగా కూడా మంచి స్పాన్ దక్కినట్టే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నివేత పేతురాజ్ – టబు- జయరాం – రావు రమేష్ – మురళి శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ కంతా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది యూనిట్.
Please Read Disclaimer