ప్యారిస్ కి ఎగిరిపోయిన ప్రేమ గువ్వలు

0

ప్రేమలో ఉన్నప్పుడు ఆ కువకువలే వేరు. వేడెక్కించే వయసు ఎన్నో గమ్మత్తయిన పనులు చేయిస్తుంటుంది. పాపం ఈ ప్రేమ గువ్వల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరికీ తెలియకుండా విదేశాలకు షికార్లకు వెళ్లిపోతున్నారు. అక్కడ అరే.. మీరూ ఇక్కడికే వచ్చారా? అంటూ కలిసి షికార్లు చేస్తున్నారు – ప్చ్..! ఇదేమైనా ప్రీప్లాన్డ్ గా చేసిందా? అంటూ కలరింగ్ కూడా ఇస్తున్నారు.

ఒకరు ఒక లొకేషన్ నుంచి ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేస్తే.. ఇంకొకరు అదే నగరంలో వేరొక స్పాట్ నుంచి ఫోటో దిగి అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఆవులిస్తే పేగులు లెక్కించే మీడియా ఉన్న కాలం ఇది. ఈ జంట వేషాలన్నీ ఇట్టే కనిపెట్టేస్తున్నారు అంతా. ఒకేసారి ఆ ఇద్దరూ అనుకోకుండానే ఆ సిటీకి వెళ్లారా.. అయితే అదెట్టా?..అసలేమీ చెవిలో చెప్పుకోకుండానే ప్యారిస్ కి యాథృచ్ఛికంగానే వెళ్లారా? ఇదోరకం వింత నాటకమా? అంటూ జనం చెవులు కొరికేసుకుంటున్నారు.

ఏదోలా స్కిప్ కొట్టేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ అబద్ధం ఎందుకు? అయినా ఎవరికైనా చెప్పి వెళ్లొచ్చు కదా! అంటూ చెవులు కొరుక్కుంటున్నారు సుశాంత్ సింగ్ ఫ్యాన్స్. రియా చక్రవర్తితో ప్రేమలో పడింది మొదలు పాపం పసోడు కంటిపై సరిగా కునుకైనా లేకుండా నీరసించి పోతున్నాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మిడ్ నైట్ పార్టీలు.. సెలబ్రేషన్ వగైరా వగైరా మామూలుగా లేదు వ్యవహారం. ఇక వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తూ చాలానే హడావుడి చేస్తున్నారు. ప్రేమలో పడ్డావా? అని అడిగేస్తే రియా అయితే అవునని అనడం లేదు. లేదు అని ఖండించడం లేదు. దీంతో ఇద్దరి మధ్యా ఏదో గమ్మత్తయిన వ్యవహారమే నడుస్తోందని అందరికీ చాలా కాలం క్రితమే డౌట్లు వచ్చేశాయి. అప్పటి నుంచి ఆ డౌట్లకు తగ్గట్టే వీళ్లు ఇలా దొరికిపోతున్నారు.