ప్రియుడిని ఇంటిని కొట్టేయాలని ప్లాన్ చేసిందా?

0

గత కొంతకాలంగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎఫైర్ల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ యంగ్ బోయ్ ఇప్పటికే ముగ్గురు భామలతో ప్రేమాయణం నడిపించాడు. తొలిగా 1నేనొక్కడినే బ్యూటీ కృతి సనోన్ తో డీప్ లవ్ లో మునిగాడు. ఆ తర్వాత ఆ లవ్ బ్రేకప్ అయ్యాక .. సైఫ్ ఖాన్ డాటర్ సారా అలీఖాన్ తో ప్రేమాయణం సాగించాడని ప్రచారమైంది. సారా బర్త్ డేకి మిడ్ నైట్ ట్రీటిచ్చిన సుశాంత్ పేరు మార్మోగింది. కేథార్ నాథ్ చిత్రంలో నటించేప్పటి స్నేహం కాస్తా అంతవరకూ వెళ్లిందని గుసగుసలు వినిపించాయి.

అటుపై ఏమైందో సారాతోనూ బ్రేకప్ అయ్యాడు. ప్రస్తుతం సారా తన పనిలో తాను ఉంది. కెరీర్ ని చక్కదిద్దుకునేందుకు ఈ యంగ్ బ్యూటీ హార్డ్ వర్క్ చేస్తోంది. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూళ్లతో గడిపేస్తూనే గాళ్ ఫ్రెండ్స్ తో షికార్లు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇటీవల ఆరేడు నెలలుగా సుశాంత్ .. తన కోస్టార్ రియా చక్రవర్తితో జోరుగా షికార్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తనతో నిండా ప్రేమలో మునిగాడని ప్రచారమవుతోంది. సుశాంత్ తో రియా షికార్లకు సంబంధించిన ప్రూఫ్ లు ఇప్పటికే బోలెడన్ని బయటపడ్డాయి. ఆ ఇద్దరూ ముంబై ఔట్ స్కర్ట్స్ లో డిన్నర్ డేటింగులకు వెళ్లిన ఫోటోలు.. విదేశాల్లో షికార్లు ప్లాన్ చేసినప్పటి ఫోటోలు ఇప్పటికే యూత్ లో హాట్ టాపిక్ అయ్యాయి. సుశ్ తో కలిసి రియా చిలిపి వేషాలన్నీ ఫోటోల రూపంలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు సీన్ మరో లెవల్ కి చేరిపోయిందని తాజాగా ఓ వార్త గుప్పు మంది. ఇంతకీ ఏం జరగబోతోంది? అంటే.. సుశాంత్ ఇటీవలే ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. బాంద్రా సమీపంలో నిర్మించిన ఆ ఇంట్లో రియా చక్రవర్తితో కాపురం పెట్టేయాలన్న ప్లాన్ ఇద్దరికీ ఉందిట. ఇక ఇటీవల గృహ ప్రవేశం చేసినప్పుడు ఆ వేడుకలో రియా సందడి పీక్స్ కి చేరుకుందని గుసగుసలు వినిపించాయి. ఆయనని పెళ్లాడి ఇక్కడే కాపురం పెట్టేస్తుందా? అంటూ వేడుకకు విచ్చేసిన అతిధులంతా ముచ్చటించుకున్నారట.

రియా కెరీర్ సంగతి చూస్తే ఈవిడకు ఇటీవల అసలు సినిమాలే లేవు. తూనీగ తూనీగ చిత్రంతో తెలుగులో కథానాయిక అయ్యింది. అటుపై మహేష్ భట్ తో ఘాటైన ఎఫైర్ సాగించి ఓ ఆఫర్ పట్టేసిందని జోరుగా ప్రచారం సాగింది. మహేష్ భట్ తో ఘాటైన చుంబనం చేస్తూ ఉన్నప్పటి ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అయ్యింది అప్పట్లో. ఇక ఇటీవల సుశాంత్ తో ఎఫైర్ స్టార్ట్ చేశాక అతడిని వీడి ఒక్క క్షణమైనా ఉండలేకపోతోంది. అందుకే ఎట్టకేలకు ఈ యంగ్ హీరోతో సెటిలవ్వాలని ప్లాన్ చేసిందన్న గుసగుస వేడెక్కించేస్తోంది. ఇంతకీ ప్రేయసి విషయంలో సుశాంత్ మనసు లో ఏం ఉంది? రియాని పెళ్లాడతాడా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ప్రస్తుతానికి కొత్త ఇంట్లోకి పర్మిషన్ ఉంది. అందుకే ప్రతిసారీ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతోంది రియా.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-