ఆత్మహత్యకు ముందు సుశాంత్ గూగుల్ లో ఏం సెర్చ్ చేశాడో తెలుసా?

0

సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య ఆయన అభిమానులతో పాటు బాలీవుడ్ వర్గాల వారిని కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం తర్వాత బాలీవుడ్ లో ఉన్న కొన్ని లొసుగులు బయట పడుతున్నాయి. చాలా కాలంగా ఉన్న నెపొటిజం గురించి ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది. బాలీవుడ్లో నెపొటిజంను సమర్ధించే వారిని సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్నారు. ఇదే సమయంలో పోలీసులు సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను ఎంక్వౌరీ చేసే పనిలో ఉన్నారు.

తాజాగా ఆయన ఫోన్ ను అన్ లాక్ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ డేటాను వెళ్లడి చేశారు. సుశాంత్ రాజ్ పూత్ మరణంకు కొన్ని నిమిషాల ముందు గూగుల్ లో తన పేరుతో సెర్చ్ చేసినట్లుగా ఫోరెన్సిక్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఆ సమయంలోనే కాకుండా అంతకు ముందు కూడా చాలా సార్లు గూగుల్ లో తన పేరుతో సెర్చ్ చేసుకునే వాడని.. తన గురించి వెబ్ మీడియాలో వస్తున్న వార్తలను విశ్లేషించుకునే వాడు అంటున్నారు.

తన గురించి కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్న కారణంగా లేదంటే తన ప్రేమ గురించి ఎక్కువగా ప్రచారం జరగడం వంటి కారణాల వల్ల ఆయన డిప్రెషన్ ఎక్కువ అయ్యి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడేమో అంటూ పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వస్తున్నారు. త్వరలోనే కేసు విచారణ పూర్తి చేస్తామని ముంబయి పోలీసు వర్గాల వారు అంటున్నారు.