సుశాంత్ మరణంతో ‘పుడ్జ్’ తిండి మానేసిందట

0

హీరో సుశాంత్ మరణం ఎంతో మందికి తీవ్ర మనోవేదనకు గురి చేసింది. కొందరు అభిమానులు ప్రాణానే విడిచి పెట్టగా కొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్యతో ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నారు. సుశాంత్ మరణం కుటుంబ సభ్యులు.. ఫ్యాన్స్ బాలీవుడ్ ప్రముఖులకు కన్నీరు మిగిల్చింది. వారికి మాత్రమే కాకుండా సుశాంత్ మరణం ఆయన పెంపుడు కుక్క పుడ్జ్ కు తీరని లోటు మిగిల్చింది.

సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కూడా అతడి పెంపుడు కుక్క అయిన పుడ్జ్ ఆహారం సరిగా తీసుకోవడం లేదట. ఎక్కువగా సుశాంత్ ఫొటోను చూస్తూ ఉంటుందట. సుశాంత్ బతికి ఉన్న సమయంలో ఇళ్లంతా క్షణం ఆగకుండా తిరుగుతూ ఉండే పుడ్జ్ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందట. డోర్ అలికిడి అయినప్పుడు లేదా కారు శబ్దం అయినప్పుడు మాత్రం సుశాంత్ వచ్చాడేమో అని ఆశగా డోర్ వద్దకు పరుగు తీస్తుందట.

పుడ్జ్ పరిస్థితిని ఆ ఇంట్లో పని చేసే పని మనుషులు చెబుతుంటే ప్రతి ఒక్కరు అయ్యో అంటున్నారు. సుశాంత్ కు పుడ్జ్ అంటే ప్రాణం. అలాగే పుడ్జ్ కూడా సుశాంత్ ను ప్రాణంగా అభిమానించిందని ఇప్పుడు తెలుస్తుంది. ఫోన్ లో సుశాంత్ ఫొటో పెట్టి ఇస్తే పుడ్జ్ అలాగే చూస్తూ ఉండి పోతుంది. గత కొన్ని రోజులుగా ఆహారం సరిగ్గా తీసుకోక పోవడంతో పుడ్జ్ ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తం అవుతుంది. సుశాంత్ జ్ఞాపకాల్లోంచి పుడ్జ్ ను బయట పడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
Please Read Disclaimer