సూశాంత్ సూసైడ్.. స్టార్ట్ లకు సరికొత్త షాక్

0

తమ అభిమాన నటీనటుల్ని.. దర్శక నిర్మాతల్ని.. క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఫాలో కావటం తెలిసిందే. ప్రజల్లో వారికున్న క్రేజ్ ఎంతో వారిని ఫాలో అయ్యే వారి సంఖ్యతో అర్థమవుతుంది. అదే సమయంలో వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయటానికి ఆన్ ఫాలో బటన్ ఉండనే ఉంది. ప్రజల మూడ్ చెప్పే ఈ తీరు తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ నేపథ్యంలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి కారణమన్న వాదనలు జోరందుకోవటమే కాదు.. స్టార్ హీరోయిన కంగనారౌనత్ ఓపెన్ గా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో వారసులకే ప్రాధాన్యం ఇస్తారని.. సుశాంత్ సూసైడ్ కు ఇదే కారణమన్న వాదనను ప్రజలు బలంగా నమ్ముతున్నారన్న విషయం తాజాగా పలువురు సెలబ్రిటీలను ఆన్ ఫాలో చేసిన తీరు చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది.అదే సమయంలో సుశాంత్ ఆత్మహత్య వేళ.. కొందరు రియాక్ట్ అయిన తీరుతో వారి పట్ల తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. ఫాలో కావటం గమనార్హం. సుశాంత్ మరణం కచ్ఛితంగా హత్యేనంటూ విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనారౌనత్ కు ఇన్ స్టాలో అమాంతంగా 20లక్షల మంది ఫాలోయర్స్ పెరగటం గమనార్హం. అదే సమయంలో.. సుశాంత్ మరణంపై స్పందించిన కృతీ సనన్ కు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఫాలోయర్స్ పెరిగారు. సుశాంత్ తో రాబ్తా సినిమాలో నటించిన కృతీ రియాక్ట్ అవుతూ.. తనలో సగ భాగాన్ని కోల్పోయినట్లుగా వ్యాఖ్యానించటమే ఆమెకు ఫాలోవర్స్ పెరగటానికి కారణంగా చెప్పాలి.బాలీవుడ్ లో బంధుప్రీతిని పెంచి పోషిస్తున్నారంటూ విమర్శలున్న స్టార్ కిడ్స్ కు ఆన్ ఫాల్ పోటు తప్పటం లేదు. సల్మాన్ ఫ్యామిలీ తనను టార్చర్ పెడుతుందంటూ దర్శకుడు అభినవ్ కశ్యప్ రాసిన లేఖ పుణ్యమా అని.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ లేఖ పుణ్యమా అని.. కండల వీరుడు ఏకంగా పది లక్షల మంది పాలోవర్స్ ను కోల్పోయారు.

స్టార్ కిడ్స్ ను ప్రమోట్ చేయటంలో పేరున్న దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు రెండున్నర లక్షల మంది ఆన్ ఫాలో అయ్యారు. మరో ప్రముఖ నటి.. స్టార్ కిడ్ అయిన అలియాభట్ దాదాపు ఐదు లక్షల మంది ఆన్ ఫాలో చేస్తే.. సోనమ్ కపూర్ కు ఈ సెగ తప్పలేదు. ఆమె సైతం రెండున్నర లక్షల మందిని కోల్పోయారు. అనన్య పాండేను కూడా 70వేల మంది ఆన్ ఫాలో చేశారు. వీరికి భిన్నంగా స్టార్ కిడ్ అయిన శ్రద్దా కపూర్ కు మాత్రం ఫాలోవర్స్ పెరగటం గమనార్హం. ఆమెకు మూడులక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకంటే.. ఆమె సుశాంత్ అంత్యక్రియలకు పాల్గొనటమే. బ్యాక్ గ్రౌండ్ ఎంతైనా ఉండొచ్చు. కానీ.. అలాంటివేమీ సామాన్యుల ఆగ్రహం ముందు నిలిచే అవకాశం లేదన్న విషయాన్ని తాజా ఆన్ ఫాలో తో చెప్పేశారని చెప్పాలి.
Please Read Disclaimer