సుశాంత్ ఆత్మహత్యతో చిక్కుల్లో జూ. శ్రీదేవి కెరీర్

0

హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కొంత కాలం అయినా ఈ మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా నెపొటిజం విషయంలో వ్యక్తం అవుతున్న విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ ఒకింత వెనక్కు తగ్గుతున్నారు. కరణ్ జోహార్ వంటి స్టార్ ఫిల్మ్ మేకర్ ఇప్పటికే తనపై వస్తున్న విమర్శల కారణంగా సోషల్ మీడియాలో తాను ఫాలో అవుతున్న స్టార్ కిడ్స్ ను అన్ ఫాలో అవ్వడంతో పాటు స్టార్ కిడ్స్ తో ప్లాన్ చేసిన సినిమాలను పక్కన పెట్టే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే తన కూతురు జాన్వీ కపూర్ ను కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టే బాధ్యత తనది అంటూ కరణ్ అప్పుడే శ్రీదేవికి హామీ ఇచ్చాడట. మొదటి సినిమాతోనే జూనియర్ శ్రీదేవి అనిపించుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. ఆగస్టు 15వ తారీకున ఓటీటీ ద్వారా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాదారణంగా అయితే కరణ్ జోహార్ సినిమా ప్రమోషన్స్ ను భారీగా చేసేవాడు. కాని ఈ సినిమాకు మాత్రం ఆయన ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు.

ఈ చిత్రం తర్వాత కూడా ఇంకా పలు సినిమాలకు జాన్వీ కపూర్ తో కరణ్ ఒప్పందం చేసుకున్నాడు. అందులో ఒకటి రెండు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. కాని నెపొటిజంకు మారు పేరు కరణ్ జోహార్ అన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలను క్యాన్సిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. జాన్వీ కపూర్ కొత్త ఆఫర్ల కోసం ఇతర ఫిల్మ్ మేకర్స్ చుట్టు తిరగాల్సి రావచ్చు అంటున్నారు. ఆమెకు ఆఫర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు నెపొటిజం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక జాన్వీ కపూర్ కు ఆఫర్లు దక్కడం కష్టమే అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఇబ్బందులు పడాల్సి రావచ్చు.
Please Read Disclaimer