డబ్బింగ్ రూమ్ లో సుశాంత్ జడ్జిమెంట్

0

యంగ్ హీరో సుశాంత్ కెరీర్ సంగతులు తెలిసిందే. వరుస వైఫల్యాల తర్వాత 2018లో `చి.ల.సౌ` చిత్రం కొంతవరకూ ఊరటనిచ్చింది. ఆ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం.. క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకోవడం అతడిలో రెట్టించిన ఉత్సాహం నింపింది. అయితే ఆ తర్వాత సుశాంత్ సడెన్ గా ఊహించని ట్విస్టిచ్చాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న `అల వైకుంటపురములో` చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించాడు. అయితే సుశాంత్ ఇలా ఒక క్యారెక్టర్ కి అంగీకరించడం చూస్తుంటే అతడి మైండ్ సెట్ లో మార్పు ఏమిటో అభిమానులు అర్థం చేసుకున్నారు. ఇక బన్ని సినిమాల్లో కనిపించే నవదీప్ తరహాలోనే సుశాంత్ కూడా పెద్ద స్టార్ల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలకు అంగీకరిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

`అల వైకుఠపురములో` మూవీలో సుశాంత్ ఎలాంటి పాత్రలో నటించనున్నాడు? అంటే ఇప్పటికే రిలీజైన పోస్టర్లను బట్టి సుశాంత్ ఒక డీసెంట్ సాఫ్ట్ కుర్రాడిగా కనిపించనున్నాడని అర్థమవుతోంది. ఇంతకుముందు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుశాంత్ పేరు రాజ్. “రాజ్ నవ్వితే ఎలాంటి వాళ్లయినా ఆకర్షితులు కావాల్సిందే!“ అంటూ అతడి పాత్ర లక్షణాన్ని పోస్టర్ పైనే రివీల్ చేశారు. దీంతో సుశాంత్ పాత్ర జోవియల్ గా ఆకట్టుకునేలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఒక అందమైన బొమ్మరిల్లు లాంటి కుటుంబంలో సుశాంత్ బ్రదర్ గా నటిస్తున్నాడా.. లేక అతడి పాత్రలో ఏవైనా ట్విస్టులు ఉంటాయా? అన్నది రివీల్ కావాల్సి ఉంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించి సుశాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పటికే అతడు డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో తాజాగా రివీలైంది.

ఇక అక్కినేని ఫ్యామిలీలో కింగ్ నాగార్జున తర్వాత ఆ స్థాయిలో హీరోలెవరూ సక్సెస్ కాలేదు ఎందుకు? అని ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే దానికి సుశాంత్ ఇచ్చిన ఆన్సర్ ఆకట్టుకుంది. “మా ఫ్యామిలీ నుంచి నలుగురం వచ్చాం అని మీరంటున్నారు. మేమంతా నాగార్జున గారి లానే ఫుల్ సక్సెస్ అవ్వాలంటే దానికంటూ ఒక ఫార్ములా ఏదీ ఉండదు. మేమంతా మా పనుల్లో చాలా సంతోషంగా ఉన్నాం. చేసే పనిలో సంతోషం వెతుక్కున్నాం. ఇష్టమైన పనిలో బిజీగా ఉన్నాం. అదే మా సక్సస్ అని భావిస్తున్నా“ అంటూ తెలివైన సమాధానమే ఇచ్చాడు. ఇటీవల అక్కినేని హీరోలంతా ఒకరినొకరు కలుసుకునేంత ఖాళీగా లేనే లేము అని కౌంటర్ వేశాడు సుశాంత్. సక్సెస్ కొందరికి తొందరగా రావొచ్చు.. మరికొందరికి లేటుగానూ రావొచ్చు. ఒకరితో ఒకరికి పోలిక ఉండదు.. అని తన అభిప్రాయం కుండబద్ధలు కొట్టాడు.
Please Read Disclaimer