ఏళ్ళ సుష్మితా పట్ల ప్రేమను చాటుకుంటున్న 28 ఏళ్ల ప్రియుడు…!

0

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుని అందాల పోటీల్లో భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. భారత్ నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి సుందరీమణిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి తన అందాలతో వెండితెరను ఒక ఊపు ఊపింది. బాలీవుడ్ లో ‘దస్తక్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘రక్షకుడు’ (తమిళం) సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కొన్నేళ్లపాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన హవా చూపించింది సుష్మితా సేన్. చివరగా 2015 లో ‘నిర్బాక్’ అనే బెంగాలీ సినిమాలో నటించిన సుష్మిత.. ఇన్నేళ్ల తర్వాత ‘హ్యాపీ యానివర్సరీ’ అనే సినిమాలో నటించబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న 44 ఏళ్ల సుష్మితా సేన్ 28 ఏళ్ల న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్ రోహమన్ షాల్ తో ప్రేమలో పడిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తమకు సంభందించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సుష్మితా సేన్ రేనీ అలీషా అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని వారి ఆలనాపాలనా చూసుకుంటోంది. రోహమన్ కూడా ఆమె దత్తపుత్రికలకు తండ్రి ప్రేమను పంచుతూ వారిలో ఒకడిగా కలిసిపోయాడు. ప్రస్తుతం సుస్మితా సేన్ తన ప్రియుడు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. కాగా సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ గా ఎన్నికై ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ప్రియుడు రోహమన్ షాల్ మాజీ విశ్వసుందరి పై ప్రశంసలు కురిపించాడు. ”26 ఏళ్లు అవుతోంది జాన్.. మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేశావు.. ఇంకా చేస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ” అంటూ రోహమన్ షాల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. మొత్తం మీద సుష్మిత ప్రియుడు ఆమె మీద తన ప్రేమను ఏదొక విధంగా చాటుకుంటూ వస్తున్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home