అభిమాని రాసిన ప్రేమలేఖకు ఫిదా అయిన స్టార్ హీరోయిన్..

0

అభిమానులు తమ ఫేవరెట్ సినీ సెలబ్రిటీల మీద మనసు పారేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ల ఫేవరెట్ హీరో కావచ్చు.. హీరోయిన్ కావచ్చు.. అలా ఎల్లప్పుడూ వారి పై ప్రేమను మనసులో పదిలంగా దాచుకుంటారు. ముఖ్యంగా కుర్రకారు హీరోయిన్ల పై లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. లవ్.. ఎఫక్షన్.. లాంటి తియ్యని అనుభూతులు అన్నీ కూడగట్టుకొని లోలోపలే మురిసిపోతుంటారు. అయితే కొందరు హుషారైన అభిమానులు మాత్రం తమ ప్రేమను అభిమాన తారకు తెలియజేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా కనిపిస్తే ప్రొపోజ్ చేయడం.. సెల్ఫీలు.. ఇలా ఏది కుదరకపోతే ప్రేమలేఖ రాసే ధైర్యం కూడా చేస్తారు.

ప్రేమలేఖ అంటేనే ఓ ఎన్నో ఫీలింగ్స్ నిండియున్నది అని అర్థం. అలా హీరోయిన్లు కూడా అభిమానులు రాసే ప్రేమలేఖలు చదువుతూ మురిసిపోతారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ విషయంలో ఇదే జరిగింది. నిజానికి అభిమానులు రాసే లవ్ లెటర్లకు సెలబ్రిటీలు స్పందించడం చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్లు. అలాంటిది తాజాగా ఓ అభిమాని రాసిన ప్రేమలేఖ చదివి హీరోయిన్ ఫిదా అయ్యిందట. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్. ఫిదా అవ్వడమే గాక మరిన్ని ప్రేమలేఖలు రాయాలని కోరిందట. ఆ అభిమాని రాసింది చిన్న ఉత్తరమే.. కానీ రావడం విశేషం అని తెగ మురిసిపోతుంది అమ్మడు.

ఈ విషయాన్ని సుస్మితా సేన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. “అద్భుతమైన ప్రేమ లేఖ. గత కొన్నేళ్ల నుంచి ప్రజల అభిమానం ప్రేమ దక్కడం నిజంగా అదృష్టం. స్వహస్తాలతో రాసిన ప్రేమలేఖలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక మీరు నాకు పంపే ప్రతి లేఖను నేను స్వయంగా చదువుతాను. అయితే మొదటిసారి చాలా సింపుల్గా రాసిన లవ్ లెటర్ ఓ అభిమాని పంపారు. దీనిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ!” అంటూ పోస్ట్ చేసింది. ఇక పదేళ్ల తరవాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుస్మితా సేన్ ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Please Read Disclaimer