భీమ్ కు మరో జోడిగా సువర్ణ

0

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ పోషిస్తున్న కొమురం భీమ్ పాత్రకు జోడీగా ఇంగ్లీష్ నటించబోతుంది. ఆమెతో పాటు ఒక గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలతో దూసుకు పోతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండుకు జోడీగా సువర్ణ పాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది.

ఎన్టీఆర్ పాత్రకు ఇద్దరు జోడీ ఉంటారని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించిన యూనిట్ సభ్యులు మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న విషయాన్ని మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్ వీఎఫ్ఎక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.