రోడ్లపైకి రాబోతున్న సాహో కార్లు బైకులు!

0

ఇండియాస్ మోస్ట్ కాస్ట్ లీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చే నెల 30న విడుదల కాబోతున్న సాహో ఇకపై పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. ఇప్పటికే వచ్చిన ఒక ఆడియో సింగల్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాని నేపథ్యంలో ఇకపై హైప్ ని పెంచే విధంగా ప్రతి ప్రోగ్రాం ని డిజైన్ చేయబోతున్నారు. అందులో భాగంగా దుబాయ్ లో షూట్ చేసిన ఓ కీలకమైన యాక్షన్ ఛేజ్ కోసం వాడిన 5 కోట్ల కారును అభిమానుల ముందుకు ప్రత్యక్షంగా తీసుకొస్తున్నారు.

స్పోర్ట్స్ కార్ గా స్పెషల్ గా ఆస్ట్రియాలో తయారు చేయించిన ఈ మోడల్ మార్కెట్ లో దొరికేది కాదు. ఎంత డబ్బున్నా కొనేందుకు ఛాన్స్ లేదు. అందుకే ఇప్పుడిది పబ్లిక్ లోకి తీసుకొస్తే సాహో క్రేజ్ కి హెల్ప్ అవుతుందన్న ప్లాన్ లో ఉంది యువి సంస్థ. కొందరు క్రేజీ అండ్ లక్కీ డార్లింగ్ ఫ్యాన్స్ కు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసే ఛాన్స్ కూడా దక్కనుంది

ఇంతే కాదు సాహో కోసం వాడిన ఖరీదైన బైకులను కూడా ప్రచారంలో వాడబోతున్నారు. ఒకటి రెండు ఫ్యాన్స్ కోసం వివిధ కాంటెస్ట్ రూపంలో గిఫ్ట్ గా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నయట. ఇంకేముంది చూస్తుంటే సాహో రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు. ఇది ఎప్పుడు నుంచి మొదలుపెడతారు అనే క్లారిటీ ఇంకా లేదు. బహుశా ఇంకో వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. వాయిదా పడినా కూడా సాహోకు మిగిలింది కేవలం 39 రోజులే. ఈ షార్ట్ టైంలోనే అన్ని ప్రోగ్రామ్స్ చేయడంతో ప్రీ రిలీజ్ కూడా పూర్తి చేయాలి. ఇకపై కాలంతో పరుగులు పెట్టాల్సిందే.
Please Read Disclaimer