నీ కంటే మా పనిమనిషి అందంగా ఉందన్న కామెంట్స్ కు హీరోయిన్ సూపర్ రిప్లై

0

సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో కొందరు సెలబ్రెటీల గురించి బూతులు తిట్టడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అందం గురించి ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద చర్చ జరుపుతూనే ఉంటారు.

హీరోయిన్స్ దృష్టిని ఆకర్షించేందుకు గాను కొందరు చేసే ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొందరు హీరోయిన్స్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తే వారి దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఉద్దేశ్యంతో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా మంది హీరోయిన్స్ అలాంటి నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోరు. కాని కొన్ని సందర్బాల్లో వారి మనసుకు ఇబ్బంది కలిగించే విధంగా కామెంట్స్ ఉండటంతో స్పందించ కుండా ఉండలేరు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ స్వరా భాస్కర్ అదే పని చేసింది.

ఒక నెటిజన్ స్వర భాస్కర్ ఇటీవల షేర్ చేసిన ఫొటోకు చీరలో నీ కన్నా మా పనిమనిషి అందంగా ఉంటుంది. ఆమె నీ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అంటూ కామెంట్ పెట్టాడు. చీర కట్టులో ఏమాత్రం బాగుండవు అంటూ స్వరా భాస్కర్ ను అతడు డైరెక్ట్ గా అంత మాట అనేశాడు.

అతడి మాటకు ఖచ్చితంగా ఎవరికి అయినా కోపం రావడం ఖాయం. స్వరా భాస్కర్ కు కూడా కోపం వచ్చింది. అయితే ఆ కోపంను అతడిలా తప్పుగా మాట్లాడి వెళ్లడించకుండా హుందాగానే మాట్లాడి అందరితో సూపర్ రిప్లై అనిపించుకుంది. అతడికి నొప్పించకుండా ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చేసింది అంటూ ఆమె తెలివిని అంతా కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మీరు అన్నట్లుగా మీ పని మనిషి చీరలో చాలా బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను. ఆమె చేసే పనికి.. ఆమె మీకు ఇచ్చే సర్వీస్ కు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమెతో మర్యాదగా వ్యవహరిస్తారని.. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ చులకనగా ఆమెను చూడరని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది.

నీ కంటే మా పని మనిషి బాగుంది అంటూ అతడు చేసిన వ్యాఖ్యలకు ఆమె అదే తీరులో ఇచ్చిన సమాధానం చాలా బాగుంది అంటూ అంతా కూడా ప్రశంసించారు. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన స్వర భాస్కర్ అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలతో కూడా మీడియాలో ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్ లను షేర్ చేసే స్వర భాస్కర్ కు బ్యాడ్ కామెంట్స్ చాలా కామన్. కాని ఈసారి మాత్రం ఆమె కాస్త సీరియస్ గా తీసుకుని స్పందించింది.