ఆస్కార్ బరిలో శ్వేతాబసు మూవీ

0

తన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ తోనే కుర్రకారు మతులు పోగొట్టింది హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో ఆమెకు లక్షల్లో అభిమానులు పుట్టుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసినా సరైన హిట్స్ లేక వెనకపడిపోయింది. ఆమె తన కెరీర్ పొడిగించుకోవడానికి ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అయినా ఆమెకు సక్సెస్ రాలేదు. ఈ సమయంలోనే ఆమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. తర్వాత కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరైన శ్వేత కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఆ కేసు నుండి క్లీన్ గా బయటకొచ్చింది.

ఈ కేసులో ఆమె పోలీసులకి దొరికిన తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ – తెలుగు సినీ అభిమానులు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఆమెను ఇండస్ట్రీకి దూరం కూడా పెట్టారు. దీంతో ఆమె అభిమానులు కొందరు తెలుగు సినీ పెద్దలని దూషిస్తూ సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్ కి సినిమాలలో ఛాన్స్ ఇస్తున్నారని – శ్వేతాబసు చేసిన చిన్న తప్పుకి ఎందుకు ఆమెను వెలివేస్తున్నారని ప్రశ్నించారు. కానీ అవి ఎవరూ పట్టించుకోలేదు.

అయినా ఆమె కొన్ని హిందీ సినిమాలలో నటించి మళ్ళీ తన కెరీర్ నిలబెట్టుకుంది కానీ హిట్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. దాంతో ఇంక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ మధ్య పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్య ఆమె రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ అనే సినిమా ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.
Please Read Disclaimer