వర్మ అబద్దం చెప్పాడంటున్న శ్వేతా రెడ్డి

0

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమా చేసినా చివరకు వెబ్ సిరీస్ ను తీసినా కూడా దాన్ని ప్రమోట్ చేసేందుకు విభిన్నమైన శైలిలో ముందుకు వెళ్తాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో ఆయన చేసిన పబ్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ చాలా నెలల క్రితమే ప్రారంభించినా ఇప్పుడు హడావుడి చేస్తున్నాడు.

తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ ఫీలింగ్ ఫుల్ సాంగ్ ను విడుదల చేశాడు. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్.. జగన్ మరియు ప్రభాస్ ను చూపించడం జరిగింది. ఈ పాటలో ప్రభాస్ ను లాగడంతో ఒక్కసారిగా వర్మ ఆకర్షించినట్లయ్యింది. ప్రస్తుతం సాహో హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పాటలో ప్రభాస్ ను జొప్పించడం అనేది వర్మ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఇక పాటలో తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటూ వర్మ చెప్పాడు.

వర్మ పాటపై యాంకర్ శ్వేత రెడ్డి విభిన్నంగా స్పందించింది. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ పై బిగ్ బాస్ నిర్వాహకులపై మండి పడుతున్న శ్వేతారెడ్డి తాజాగా వర్మ పాటపై కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు వర్మ తీసిన సినిమాల్లోని పాటలతో పోల్చితే ఈ పాట చాలా ప్రత్యేకమైనది. నా కుటుంబం.. నా ఇల్లు.. నావాళ్లు అని చెప్పుకున్నప్పుడు నా కులం అని చెప్పుకోవడంలో తప్పేం లేదని వర్మ ఈ పాటలో అన్నాడు. అయితే అది ఆయన ఒరిజినల్ అభిప్రాయం కాదనిపిస్తుంది.

సినిమా పబ్లిసిటీ కోసం అలా కులం గురించి వర్మ మాట్లాడుతున్నాడనిపిస్తుంది. కులం పేరు ఎత్తితే ఎవరైతే రెచ్చి పోతారో వారిని తనను ఫాలో అయ్యేలా చేసుకునేందుకు వర్మ ఈ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. పాటలోని ఆయన కసి.. పళ్లు కొరికే తీరును బట్టి చూస్తుంటే కులం గురించి ఆయన అభిప్రాయం పాటలో చూపిన దానికి పూర్తి విరుద్దంగా ఉంటుందనిపిస్తుంది. సాహో సినిమా కారణంగా ప్రభాస్ ట్రెండింగ్ లో ఉన్నాడు కనుక ఈ పాటలో ప్రభాస్ ప్రస్తావన కూడ తెచ్చి ఉంటాడని శ్వేత రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన తన సినిమాను ప్రమోట్ చేసేందుకు ఏం చేసేందుకైనా వెనకాడడు అంటూ శ్వేతా రెడ్డి పేర్కొంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home