‘సైరా’ జక్కన్న గుర్తొచ్చాడే!

0

సైరా నరసింహ రెడ్డి ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. సూపర్ హిట్ టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ వైపు వెళ్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ముందు నుండి ‘బాహుబలి’నే ఆదర్శంగా తీసుకున్నారు. బడ్జెట్ పరంగా కూడా సైరా కి బాహుబలి ధైర్యాన్నిచ్చింది. ఈ విషయాన్ని ఎన్నో సార్లు మెగా స్టార్ చెప్తూ వచ్చారు కూడా.

కాస్టింగ్ విషయంలో కూడా ‘సైరా’కు బాహుబలినే ఆదర్శం. ‘బాహుబలి’ సిరీస్ లో ప్రభాస్ – అనుష్క – తమన్నాలతో పాటు కొన్ని సెపరేట్ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని సత్యరాజ్ – రానా – రమ్య కృష్ణ లతో వాటిని చేయించాడు జక్కన్న. కాస్టింగ్ విషయంలో ‘బాహుబలి’ను ఆదర్శంగా తీసుకొని ఒక్కో భాష నుండి ఒక్కొక్కరిని తీసుకున్నారు. అంతెందుకు బాహుబలి రిలీజ్ తరవాత సైరా కథలో చాలా మార్పులు జరిగాయట. ఇక సినిమాలో దేశభక్తితో పాటు డ్రామా – సెంటిమెంట్ – ప్రేమ – పోరాట సన్నివేశాలు ఇలా అన్నీ ‘బాహుబలి’లో ఉన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఇక సినిమాలో యుద్ధ సన్నివేశాలు – యుద్ధం చేసే టప్పుడు ఎత్తుకుపై ఎత్తు వేసే విధానం కచ్చితంగా ప్రేక్షకులకు వద్దన్నా ‘బాహుబలి’ను జక్కన్న ను గుర్తుచేస్తాయి.

ఏ మాటకామాటే నిజంగా ఇలాంటి సినిమాలకు ‘బాహుబలి’ ఓ గొప్ప ప్రేరణగా నిలిచింది. అలాగే దర్శకులందరికీ ఓ పాఠంలా మారింది. ఒక రకంగా సురేందర్ రెడ్డి ఎలా లేదన్నా రాజమౌళి ని ఆదర్శంగా తీసుకునే చిరు ప్రతిష్టాత్మక సినిమాను చేపట్టారని నమ్మాల్సిందే.
Please Read Disclaimer