‘సైరా’ టాకీ ఎట్టకేలకు సంపూర్ణంగా..

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఖైదీనంబర్` 150 రిలీజై ఇప్పటికే ఏడాది పైగానే అయ్యింది. 2017 సంక్రాంతికి ఆ సినిమా రిలీజైంది. బాస్ రీఎంట్రీలో అదరగొట్టేశారు. అయితే ఆ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని వేచి చూసి కానీ మెగాస్టార్ తిరిగి మరో సినిమాకి సంతకం చేయలేదు. పరుచూరి బ్రదర్స్ వారి `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` కథకు ఓకే చెప్పి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 200కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని ప్రచారమవుతోంది.

ఉయ్యాలవాడ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు .. అతడి కథలో వీరత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఓవైపు సురేందర్ రెడ్డితో పాటు మరోవైపు టెక్నికల్ టీమ్ అంతే ఇదిగా శ్రమిస్తున్నారు. ఎట్టకేలకు సంపూర్ణంగా షూటింగ్ పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్- పాటలు సహా పాటలు- టాకీ చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సంగతిని సైరా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. “సైరా షూటింగ్ పూర్తయింది. మా బృందంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది మర్చిపోలేని జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. డిఐ వర్క్ కూడా మొదలైంది“ అని వివరాల్ని అందించారు. మెగాస్టార్ ఇప్పటికే శబ్ధాలయాలో డబ్బింగ్ పనులు ప్రారంభించారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్- విజయ్ సేతుపతి- కిచ్చాసుదీప్- జగపతిబాబు- అనుష్క- తమన్నా తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. డెడ్ లైన్ ప్రకారం పనులన్నీ పూర్తి చేసేందుకు సూరి- చరణ్ బృందం పకడ్భందీగా ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నారట.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home