సాహో పోస్టర్: ఒకే ఫ్రేమ్ లో సైరా స్టార్లు

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సైరా-నరసింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ముంబైలో సైరా టీజర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ తో సైరా రేంజ్ ఎంతో బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలకు అర్థమైంది. సాహో తర్వాత మళ్లీ అలాంటి ఛాలెంజింగ్ సినిమా టాలీవుడ్ నుంచే బరిలో దిగుతోందని టీజర్ క్లియర్ కట్ గా చెప్పేసింది. సైరా టీజర్ వేడుకలో బిగ్ బి అమితాబ్ మిస్సయినా చిరంజీవి-చరణ్-సురేందర్ రెడ్డి- సుదీప్-రవికిషన్- తమన్నా తదితర స్టార్లు పాల్గొన్నారు.

టీజర్ తో పాటుగా తాజాగా సైరా స్టార్లందరినీ ఒకే ఫ్రేమ్ లో ఆవిష్కరించే లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఒక్కొక్కరి బర్త్ డే సందర్భంగా విడివిడిగా పాత్రల్ని పరిచయం చేస్తూ పోస్టర్లను లాంచ్ చేశారు. ఈసారి ఆ స్టార్లందరినీ ఒకే చోటికి చేర్చి పోస్టర్ ని వేయడం అభిమానులకు కన్నుల పండుగేనని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో సైరా నరసింహారెడ్డి పాత్ర ధారి చిరంజీవితో పాటు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ (నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న) – సుదీప్ (అవుకురాజు)-విజయ్ సేతుపతి(రాజ పాండి)-జగపతిబాబు(వీరా రెడ్డి)- నయనతార(సిద్ధమ్మ)- తమన్నా(లక్ష్మి అనే నర్తకి) లను పోస్టర్ లో ఆవిష్కరించారు.

సైరా టీజర్ ట్రీట్ అదిరింది. ఇక ట్రైలర్ ట్రీట్ కోసం మెగా ఫ్యాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా దీనిపై సరైన స్పష్టత లేదు. చిరు బర్త్ డే సందర్భంగా భారీగా మెగాభిమానుల సమక్షంలో ఓ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లోనే సైరా ట్రైలర్ ని రిలీజ్ చేస్తారా? లేక అందుకు ఇంకా సమయం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer