అమెరికా ప్రీమియర్స్ లొల్లేంటట?

0

ప్రపంచ వ్యాప్తంగా మెగాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లో ప్రీమియర్ షోల హడావుడి సాగుతోంది. అమెరికాలో మిడ్ నైట్ ప్రీమియర్ తో అసలు హడావుడి మొదలైంది. అయితే ప్రీమియర్ల వేళ అమెరికా పంపిణీదారుల్లో లుకలుకల గురించి ఓ ఆసక్తికర సంగతి తెలిసింది. సినిమా రిలీజ్ ముందు ఉయ్యాలవాడ వారసుల కారణంగా వివాదంలో చిక్కుకున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో మరో వివాదం చివరి నిమిషంలో టెన్షన్ పెట్టిందట. ఈ చిత్రాన్ని ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు – ఫార్స్ ఫిల్మ్స్ కు మధ్య ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రతిష్టంభన చివరి నిమిషం వరకూ ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో `సైరా` ప్రీమియర్స్ సజావుగా పడతాయా? లేదా అనే ఉత్కంఠ నిన్న(మంగళవారం) సాయంత్రం వరకూ కొనసాగిందట.

ఈ స్థాయి భారీ చిత్రానికి ఓవర్సీస్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి కావడంతో అభిమానులు అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర యూఎస్ ప్రీమియర్స్ పై ఉత్కంఠ కొనసాగింది. క్యూబ్ ల రాక కూడా కొన్నిచోట్ల ఆలస్యమైందని నివేదన అందింది. ఈ చిత్రాన్నియూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఫార్స్ ఫిల్మ్స్ `సైరా` ఫిల్మ్ ప్రొజెక్షన్ కు సంబంధించిన కేడీఎమ్ ను రెండు రోజుల కాలపరిమితితో మాత్రమే అనుమతిస్తూ కేటాయించారట. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం మొత్తం అమౌంట్ ని సెటిల్ చేసినా ఫార్స్ ఫిల్మ్స్ వారు పూర్తి స్థాయిలో ప్రదర్శనకు ఆక్సెస్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోందట.

ఇరువురి మధ్య ఈ వివాదం ముగిసి `సైరా` ప్రీమియర్స్ సాఫీగా సాగాలని.. చిరు కోసం రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎలాంటి అవాంతరాలు లేకుండా యూఎస్ లో విడుదల కావాలని మెగా అభిమానులు.. ఓవర్సీస్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రీరిలీజ్ దశ నుంచే అంచనాలు తారా స్థాయికి చేరాయి. కొన్ని గంటల్లో తుపాకి రివ్యూ కోసం .. వాచ్ దిస్ స్పేస్..
Please Read Disclaimer