సౌత్ టాప్ 10లో `సైరా` స్థానం ఎక్కడ?

0

భారతదేశంలో భారీ పాన్ ఇండియా చిత్రాల హవాపై వాడి వేడిగా చర్చ సాగుతోంది. బాహుబలి 2 ప్రభంజనం తర్వాత మళ్లీ ఆ రికార్డును కొల్లగొట్టడం ఎవరి తరం కావడం లేదు. ఇటు తెలుగు-తమిళ పరిశ్రమలు సహా అటు హిందీ పరిశ్రమలోనూ ఎంత ట్రై చేసినా ఎవరి వల్లా కాని పరిస్థితి ఉంది. అయితే ఓపెనర్ సెంచరీ కొడితే వన్ డౌన్ హాఫ్ సెంచరీ అయినా కొట్టినట్టు.. ఆ తర్వాత వచ్చిన చాలా భారీ చిత్రాలు ఆశించదగ్గ ఓపెనింగుల్నే సాధించాయి. సౌత్ లో టాప్ 10 లో డే వన్ ఓపెనర్స్ జాబితాని పరిశీలిస్తే..

బాహుబలి 2 చిత్రం 215 కోట్ల వసూళ్లతో నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం 127కోట్ల గ్రాస్ తో రెండో స్థానంలో నిలిచింది. రజనీ 2.0 చిత్రం 95కోట్లతో మూడో స్థానంలో నిలవగా.. కబాలి 88 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మెగాస్టార్ సైరా 82కోట్లతో ఓపెనింగుల పరంగా ఐదో స్థానాన్ని అందుకుంది.

బాహుబలి చిత్రం 73 కోట్లతో ఐదో స్థానంలో ఉండేది. అది కాస్తా సైరా ఓపెనింగ్ రికార్డు వల్ల ఒక స్థానం కిందికి దిగింది. ఆ తర్వాత సర్కార్ 67కోట్లతో ఏడో స్థానంలో.. అజ్ఞాతవాసి 61కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 58కోట్ల తో అరవింద సమేత 9వ స్థానంలో నిలవగా.. 55కోట్లతో భరత్ అనే నేను పదో స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో ప్రభాస్ మూడు స్థానాలు కొల్లగొట్టగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు స్థానాల్ని చేజిక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి .. ఇలయదళపతి విజయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ మహేష్ పేర్లు టాప్ 10 ఓపెనర్స్ జాబితాలో నిలిచాయి.
Please Read Disclaimer