సైరా ప్రీరిలీజ్ బిజినెస్ రేంజ్

0

`సాహో` తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతున్న తెలుగు చిత్రం `సైరా: నరసింహారెడ్డి`. తెలుగు-తమిళం-మలయాళం-హిందీ-కన్నడలో అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా సైరా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమాకి నైజాం- 30కోట్లు (దిల్ రాజు).. సీడెడ్- 22 కోట్లు (ఎన్ వి ప్రసాద్).. నెల్లూరు- 5.20 కోట్లు (హరి పిక్చర్స్).. కృష్ణా – 9కోట్లు (జీ3 ఫిల్మ్స్).. గుంటూరు -11.50 కోట్లు (యువి క్రియేషన్స్).. వైజాగ్- 14.40 కోట్లు (క్రాంతి ఫిలింస్).. తూర్పు గోదావరి – 10.40 కోట్లు (విజయ లక్ష్మి ఫిలింస్).. పశ్చిమ గోదావరి- 9.20 కోట్లు (ఉషా పిక్చర్స్) మేర పలికింది. ఓవరాల్ గా ఆంధ్రా- తెలంగాణా కలుపుకుని 112 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. అలాగే ఓవర్సీస్ హక్కుల్ని 18 కోట్లకు విక్రయించారని ఇదివరకూ ప్రచారమైంది. తమిళం-మలయాళం-కన్నడంలో బిజినెస్ రేంజ్ ఎంత? అన్నది చూడాలి. హిందీలో ఫర్హాన్ అక్తర్- రవీనా టాండన్- తడానీ (ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్- ఏఏ ఫిలింస్) బృందం సైరా రిలీజ్ హక్కులు చేజిక్కించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి- బిగ్ బి అమితాబ్ బచ్చన్- కిచ్చ సుదీప్- విజయ్ సేతుపతి- నయనతార- తమన్నా వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. ఈనెల 18న అత్యంత భారీగా ప్రీరిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్ – మేకింగ్ వీడియోలతో హైప్ పెరిగింది. ట్రైలర్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ట్రైలర్ తో మరింత హైప్ పెరుగుతుందేమో చూడాలి.
Please Read Disclaimer