సైరా షోలు క్యాన్సిల్.. కెనడా డిస్ట్రిబ్యూటర్ కు లాస్?

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ అక్టోబర్ 2 న విడుదలైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కు భారీ ఫాలోయింగ్ ఉండడంతో చాలా దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం కెనడాలోని టొరంటోలో ‘సైరా’ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇలా షోస్ రద్దు కావడానికి రెండు సంఘటనలు కారణమయ్యాయని సమాచారం అందుతోంది.

ఒంటారియో రీజియన్ లో ‘సైరా’ సినిమాను ప్రదర్శిస్తున్న ల్యాండ్ మార్క్ సినిమా థియేటర్లలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో స్క్రీన్ ను కట్ చేశారట. అంతే కాకుండా పెప్పర్ స్ప్రేను ప్రేక్షకులపై చల్లారట. ఈ సంఘటనలు ఒంటారియో ప్రావిన్సులోని కిచెనర్ ఏరియాలోనూ.. విట్బీ ఏరియాలోనూ జరిగాయట. ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖవారు ఆగంతకులు ఆయుధాలతో ప్రేక్షకులపై దాడి చేసే అవకాశం ఉటుందనే ఉద్దేశంతో ల్యాండ్ మార్క్ సినిమాస్ వారిని అలెర్ట్ చేశారట. దీంతో ఒంటారియో ప్రావిన్స్ లో సైరా షో లను రద్దు చేశారట.

కారణాలు ఏవైనప్పటికీ ఇలా ‘సైరా’ షోలను అర్థాంతరంగా రద్దు చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ‘సైరా’ షోలను ప్రదర్శించని పక్షంలో ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ కు నష్టం తప్పదని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో.. ‘సైరా’ షోలకు మళ్ళీ అనుమతినిస్తారా లేదా అనేది వేచిచూడాలి.
Please Read Disclaimer