అదే స్టాటజీ ఫాలో అవుతున్న ‘సైరా’ టీమ్ !

0

మెగా స్టార్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ ‘సైరా’ కి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ప్రతీ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఓ లెక్క ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మెగా స్టార్ అండ్ టీమ్ టార్గెట్ ‘సైరా’ను జనాల్లోకి తీసుకెళ్లి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడం. ఆగస్ట్ 20 న రిలీజ్ అయ్యే టీజర్ నుండి సైరా హంగామా షురూ అవుతుంది. ఈ టీజర్ తో ప్రమోషన్స్ లో మరింత ఊపు పెంచనున్నారు మేకర్స్. ఇప్పటికే గ్రాండ్ గా ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

అయితే టీజర్ విషయంలో మాత్రం ‘డియర్ కామ్రేడ్’ స్టాటజీ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. ఆ సినిమా కూడా నాలుగు భాషల్లో విడుదలైంది. అందుకే బాలీవుడ్ నుండి – కోలీవుడ్ నుండి – సాండల్ వుడ్ నుండి మల్లువుడ్ నుండి ఒక్కో స్టార్ ను ఎంచుకొని ప్రమోషన్స్ కోసం వారి ఇమేజ్ ను వాడుకున్నారు. సినిమాలో ఒక పాటను కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో అదే పాటను మలయాళంలో దుల్కర్ తో పాడించారు కూడా. ఇప్పుడు సైరా విషయంలో అదే జరుగుతోంది.

రెండ్రోజుల్లో విడుదల కానున్న టీజర్ ను ఒక్కో భాషలో ఒక్కొ సూపర్ స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారట. ఇప్పటికే అన్ని భాషల్లో స్టార్స్ వాయిస్ ఓవర్ చెప్పేసారని తెలుస్తుంది. తమిళ్ లో సూపర్ స్టార్ రజిని వాయిస్ ఓవర్ తో మలయాళంలో మోహన్ లాల్ కన్నడలో యష్ వాయిస్ ఓవర్ తో సైరా టీజర్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఎలాగో పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో రిలీజయ్యే నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోల వాయిస్ ని టీజర్ కోసం వాడుకుంటూ టీజర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Please Read Disclaimer