క్లారిటీ ఇచ్చిన ‘సైరా’ టీం

0

ఏ ముహూర్తాన సైరా ప్రమోషన్స్ మొదలెట్టారో కానీ అన్ని ఉడిదుడుకులే ఎదురవుతున్నాయి. నెల ముందే ఓ రేంజ్ ప్రమోషన్స్ అనుకుని డ్రాప్ అయ్యారు. ఈ నెల 18 అంటే రేపు కర్నూల్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ అనుకున్నారు. అక్కడ గ్రాండ్ గా ట్రైలర్ ను వదలనున్నట్లు తెలిపారు. కట్ చేస్తే వాతావరణ సమస్యలతో అది కూడా క్యాన్సల్ అయింది. ఇప్పుడు ప్లేస్ తో పాటు డేట్ కూడా మార్చుకున్నారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 22 న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే సైరా ట్రైలర్ అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఫ్యాన్స్ ను మొన్నటి ఊరిస్తున్నారు. అయితే రేపు ట్రైలర్ ఉంటుందా ఉండదా అని ఒకవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నిరాశ పరిచారు. అందుకే ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ గా కొణిదెల ప్రొడక్షన్ నుండి ఓ అప్డేట్ వదిలారు ‘సైరా’ టీం. రేపు యధావిధిగా ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

సో ఎట్టకేలకు మెగా అభిమానుల ప్రశ్నలకు అఫీషియల్ అప్డేట్ తో క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా సైరా ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో లేవని అటు మెగా ఫ్యాన్స్ ఇటు సినీ అభిమానులు వారి భావాన్ని సామాజిక మాద్యం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అయినా మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతరేమో చూడాలి.
Please Read Disclaimer