హిందీ బిగ్ బాస్ కు సైరా టీమ్?

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా కలెక్షన్స్ లేవు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ చరణ్ టీమ్ ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేయాలేదన్నది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ టీమ్ హిందీ వెర్షన్ ప్రమోషన్స్ లో జోరు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా త్వరలో బిగ్ బాస్ లో షోకు అతిథులుగా హాజరుకాబోతున్నరట. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్వహించే బిగ్ బాస్ సీజన్ 13 లో ‘సైరా’ టీమ్ కనిపిస్తారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి.. నిర్మాత రామ్ చరణ్ తో పాటుగా తమన్నా కూడా పాల్గొంటారని టాక్.

సల్మాన్ తో మొదటి నుంచి చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు చరణ్ కూడా సల్మాన్ కు చాలా క్లోజ్. సల్మాన్ సినిమాల తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పడమే కాదు.. సల్మాన్ ట్రైలర్లను కుడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తుంటాడు. మరి సల్మాన్ కు ఇంత క్లోజ్ గా ఉండే చిరు.. చరణ్ లు బిగ్ బాస్ షోకు హాజరయితే ఆ సందడే వేరు. ఈ వీకెండ్ షోలోనే ‘సైరా’ టీమ్ సందడి చేసే అవకాశం ఉందట.
Please Read Disclaimer