లిరికల్ వీడియో: తొలిసమరపు ఉద్వేగం

0

నిన్న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బాలీవుడ్ కు చెందిన అమిత్ త్రివేది సీమ నేపధ్యం కలిగిన ఇలాంటి కథకు ఎలాంటి ట్యూన్స్ ఇచ్చి ఉంటాడా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ అద్భుతమైన కంపోజింగ్ తో టైటిల్ ట్రాక్ తోనే అదరగొట్టేశాడు.

పవిత్ర భారతాంబ ముద్దుబిడ్డ ఔరా ఉయ్యాలవాడ నారసింహుడా అంటూ సాగే సిరివెన్నెల సాహిత్యం ఆద్యంతం సైరా గొప్పదనాన్ని వివరిస్తూ అప్పటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరోసారి అవార్డు గెలిచే స్థాయిలో ఉంది. దాస్యం కన్నా చావే మేలనే నరసింహరెడ్డి గొప్పదానాన్ని సిరివెన్నెల గారు తనకు మాత్రమే సాధ్యమయ్యే సాహిత్యంతో జీవం పోశారు

ఇలాంటి గ్రాండియర్ కు కావలసిన సరైన సాంగ్ తో సైరా ఆడియో పరంగానూ మొదటి సక్సెస్ అందుకుంది. బీట్స్ పరంగా మోడర్న్ టచ్ ఉన్నప్పటికీ ఎమోషన్ ని మిస్ కాకుండా అమిత్ త్రివేది తీసుకున్న జాగ్రత్త చాలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. మిగిలిన పాటలపై సైతం ఆసక్తి కలిగేలా దీనికి ఫీడ్ బ్యాక్ రావడం గమనార్హం.

సోషల్ మీడియాలోనూ దీని మీద ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. శ్రేయా ఘోషల్ – సునిధి చౌహన్ పోటీ పడుతూ అందించిన గళాలు పాటకు నిండుతనాన్ని తెచ్చాయి. మొత్తానికి సైరా రేంజ్ కు తగ్గ ఆడియో ట్రాక్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మొదటి పాటే హిట్టు కొట్టడం విశేషం.
Please Read Disclaimer