రెండు రోజుల్లో మెగా టీజర్

0

సరిగ్గా రెండేళ్ల క్రితం మెగా స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ థమన్ నేపథ్య సంగీతంతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. గతేడాది మెగా స్టార్ జన్మదినం రోజు కొన్ని సన్నివేశాలతో ఓ టీజర్ వదిలారు. ఆ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచేసింది. రెండేళ్లుగా చిరు పుట్టినరోజు కానుకగా టీజర్స్ వదులుతూ వస్తున్న మేకర్స్ ఈసారి రోమాలు నిక్కపొడిచే సన్నివేశాలతో మరో టీజర్ రెడీ చేసారు. ఇటీవలే టీమ్ కష్టాన్ని చూపిస్తూ ఓ మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు.

మోస్ట్ ఎవైటింగ్ ‘సైరా’ టీజర్ రెడీ అయింది. ఆగస్ట్ 20 న మెగా స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని మరో రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీజర్ కి వాయిస్ ఓవర్ అందించడంతో టీజర్ పై అంచనాలు పెరిగాయి. స్వాతంత్ర యుద్ధ వీరుడు సైరా నర్సింహ రెడ్డి గురించి పవన్ వాయిస్ ఓవర్ తో టీజర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉంటుందట.

గతేడాది రిలీజ్ చేసిన టీజర్ లో ‘ఈ యుద్ధం ఎవరిది’ అని ఒకే ఒక్క డైలాగ్ మాత్రం ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసే టీజర్ లో చాలా ఎట్రాక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా టీజర్లో మెగా స్టార్ చెప్పే ఓ డైలాగ్ ఫ్యాన్స్ కి ట్రీట్ అంటున్నారు. కొన్ని యుద్ధ సన్నివేశాలు కూడా టీజర్ లో ఎటాచ్ చేశారట. యుద్ధ సన్నివేశాలు ప్రతీ సినిమా ప్రేమికుడ్ని కట్టి పడేసేలా ఉంటాయని టాక్. ప్రస్తుతం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్న చరణ్ అండ్ టీమ్ ప్రస్తుతం ఈ టీజర్ ని థియేటర్స్ లో కూడా స్క్రీనింగ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సాహోతో పాటు థియేటర్స్ లో ప్లే చేసే ఛాన్స్ ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home