2 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన సైరా

0

ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాల కలెక్షన్స్ నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. గతంలో ఒక మిలియన్ మార్క్ ను అవలీలగా చేరుకునే స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు వన్ మిలియన్ మార్క్ టచ్ చేసేందుకే కష్టపడుతున్నాయి. ఇక 2 మిలియన్ డాలర్ మార్క్ అందుకోవడం కూడా కష్టంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా కూడా అమెరికాలో భారీ కలెక్షన్లయితే నమోదు చేయలేకపోయింది కానీ డీసెంట్ కలెక్షన్స్ తో చిరు స్టామినాను మరోసారి చాటింది.

మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి సైరా 2 మిలియన్ మార్కును దాటింది. దీంతో అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన టాలీవుడ్ సినిమాల లిస్టులో 16 వ స్థానంలో నిలిచింది. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేందుకు ఇంకా చాలాదూరమే ప్రయాణించాల్సి ఉంది కానీ ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ డీసెంట్ అనే చెప్పవచ్చు. ఈ సినిమాతో చిరు ఖాతాలో రెండు 2 మిలియన్ డాలర్ చిత్రాలు చేరాయి. చిరు రీ-ఎంట్రీ చిత్రం ఖైది నెం.150 తో మొదటిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చోటు సాధించారు. తాజాగా సైరా తో మరోసారి ఆదే ఫీట్ రిపీట్ చేశారు.

బాలీవుడ్ చిత్రం వార్ తో పోటీ ఉన్నప్పటికీ సైరా మొదటి వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబట్టడం మెగాస్టార్ సత్తాను తెలిపే అంశమే. అయితే ఇకపై ‘సైరా’ ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి. బ్రేక్ ఈవెన్ దిశగా సాగాలంటే సోమవారం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ లేకుండా ఉండాలని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.
Please Read Disclaimer