పెళ్లి కాకుండా పిల్లల్ని కననంటూ.. లవ్ పై పెదవి విప్పింది!

0

ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత.. బయటకు వచ్చేటప్పుడు గ్లామర్ తళుకుబెళుకులకు ఏ మాత్రం లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకునే నటీమణులు బోలెడంతమంది కనిపిస్తారు. కానీ.. తాప్సీ మాత్రం ఇందుకు భిన్నం. తాను కారు కొనుక్కునే వేళలో.. షోరూంకు వెళ్లిన సందర్భంగా అక్కడి వారు ఆమెకు కారును హ్యాండోవర్ చేసే సమయంలో చిన్నపాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

దానికి సంబంధించిన వీడియో కొంతకాలం క్రితం వైరల్ అయ్యింది. ఆ వీడియోలో తాప్సీని చూస్తే.. ఆమె ఎంత సాదాసీదా దుస్తులు ధరించి షోరూంకు వెళ్లిందో చూస్తే.. మిగిలిన హీరోయిన్లకు తాప్సీకి మధ్య తేడా ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. హీరోయిన్లను ఎవరైనా ప్రేమ గురించి అడిగితే.. ఇప్పుడే ప్రేమ.. పెళ్లి ఏమిటి? సీరియస్ గా కెరీర్ అంశాల్ని చూస్తున్నట్లుగా బిల్డప్ లు ఇస్తుంటారు.కానీ.. తాప్సీని లవ్ మ్యాటర్ అడిగితే ఆమె ఎంత ఫ్రాంక్ గా విషయాల్ని తేల్చేశారో చూస్తే ఫిదా కావాల్సిందే.

తాను ప్రేమిస్తున్న వ్యక్తి నటుడు కాదు.. క్రికెటర్ కూడా కాదని.. ఆ మాటకు వస్తే అతను తనకు చాలా దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చింది. అతన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? ఎప్పుడు పిల్లల్ని కంటాను? అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని.. వాటి గురించి అందరితో చర్చించలేనని చెప్పింది. ఈ విషయాల్ని తాను తన తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడతానని స్పష్టం చేసింది.

పెళ్లి తర్వాతే పిల్లలని.. పెళ్లికి ముందే పిల్లల్ని కనటం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. అలా అని.. పెళ్లికి ముందే పిల్లల్ని కనేవారిని తాను తప్పు పట్టటం లేదని క్లియర్ చేసింది. ఎవరి అభిప్రాయాలు వారివని.. తాను తన అభిప్రాయం మాత్రమే చెప్పిన తాప్సీ.. తన మనసుకు నచ్చిన వాడి గురించి ఓపెన్ కావటం ఇష్టం లేదన్న మాటను స్పష్టంగా చెప్పేశారని చెప్పాలి. అదే సమయంలో తాను ఇష్టపడుతున్న వ్యక్తిని తన సోదరి షబ్నమ్ ద్వారా పరిచయమైందన్నది నిజమేనని.. అందులో ఏమీ తప్పు లేదు కదా? అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
Please Read Disclaimer