ఔను పారితోషకం పెంచాను

0

వరుసగా విజయాలు సాధిస్తున్న నటీనటులు పారితోషకాలు పెంచడం మామూలే. కానీ ఈ విషయంపై మాట్లాడ్డానికి వాళ్లు ఇష్టపడరు. కానీ తాప్సి మాత్రం ఇందుకు భిన్నమే. గత కొన్నేళ్లలో బాలీవుడ్ సినిమాల్లో ఆమె ఎంత మంచి పేరు సంపాదించిందో.. ఎన్ని విజయాలందుకుందో తెలిసిందే. బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో ఒకరిగా ఎదిగిందామె. దీంతో సహజంగానే ఆమె పారితోషకం పెరిగి ఉంటుంది. ఇదే విషయం మీద విలేకరులు ప్రశ్నిస్తే తాప్సి తడబడకుండా సమాధానం చెప్పింది. తాను పారితోషకం పెంచిన మాట వాస్తవమే అని చెప్పింది. గత రెండేళ్లలో తన రెమ్యూనరేషన్ అమాంతం పెరిగినట్లు తాప్సి చెప్పడం విశేషం.

అయితే అది డిమాండ్ చేసి పుచ్చుకుంటున్నది కాదని.. నిర్మాతలే ఇష్టపూర్వకంగా తన ప్రతిభకు తగ్గట్లు పారితోషకం ఇస్తున్నారని తాప్సి చెప్పింది. పురుష నటులతో పోలిస్తే తాను తీసకుంటున్న పారితోషకం తక్కువే అని కూడా తాప్సి అంది. తనకిస్తున్న పారితోషకం పట్ల దర్శక నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పింది. బాగా డబ్బులు సంపాదించేయాలన్న కోరిక తనకు లేదని.. అలాగే తన పారితోషకం వల్ల సినిమా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం తాను ఎప్పుడూ రానివ్వనని తాప్సి స్పష్టం చేసింది. గతంలో తనకు అవకాశం దక్కుతుందా అని ఎదరు చూస్తూ వేరే వాళ్ల దయ మీద ఆధారపడేదాన్నని.. కానీ ఇప్పుడు మంచి మంచి సినిమాలు తననే వెతుక్కుని వస్తున్నాయని తాప్సి తెలిపింది.
Please Read Disclaimer