అప్పటి నుంచి ఆమెను నేను ఫాలో అవుతున్నా!

0

ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఒరియంటెడ్ ఫిలిం చేయాలంటే నిర్మాతలకు గుర్తొచ్చే హీరోయిన్ల పేర్లు రెండే. భారీ బడ్జెట్ ఫిలిం అయితే కంగనా.. మీడియం బడ్జెట్ అయితే తాప్సీ. కంగనా రేంజ్ వేరు కాబట్టి అందరూ కంగనాతో సినిమాలు చేయలేరు. అందుకే వారందరకీ తాప్సీ సెకండ్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే చేతిలో ఫుల్ గా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆల్రెడీ ఉన్న సినిమాలకు తోడుగా మిథాలి రాజ్ బయోపిక్ లో నటించేందుకు సైన్ చేసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మిథాలి రాజ్ బయోపిక్ పై స్పందించింది. తనను మిథాలి రాజ్ బయోపిక్ కోసం నిర్మాతలు సంప్రదించిన విషయం వాస్తవమేనని అంగీకరించింది. “నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు కానీ ఈ ఛాలెంజ్ ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. మిథాలి ‘లేడీ క్రికెటర్లను ఎప్పుడూ వారి ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరిని అడుగుతారు.. మరి రివర్స్ లో అలా ఎందుకు అడగరు?’ అని ప్రశ్నించినప్పటి నుంచి నేను ఆమెను ఫాలో అవుతున్నాను. ఆమె అడిగిన ప్రశ్న నా మనసులో ఇప్పటికీ అలా ఉండిపోయింది” అంటూ మిథాలి రాజ్ గురించి చెప్పుకొచ్చింది.

వుమెన్ క్రికెట్ లో 6000 కు పైగా రన్స్(వన్ డే ఇంటర్నేషనల్స్) సాధించిన ఏకైక ప్లేయర్ మిథాలి మాత్రమే. ప్లేయర్ గానే మాత్రమే కాకుండా ఇండియా వుమెన్ టీమ్ కు కెప్టెన్ గా మిథాలి రాజ్ తన సత్తా చాటారు. రెండేళ్ళ క్రితం వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ను సెమీస్ వరకూ నడిపించారు. ఆమెను భారత ప్రభుత్వం అర్జున.. పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. ఇలాంటి ఘనతలు సాధించిన మిథాలి బయోపిక్ ను వయకాం 18 మోషన్ పిక్చర్స్ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు దర్శకుడు.. ఇతర టెక్నిషియన్లు.. నటీనటుల వివరాలు వెల్లడిస్తారు.
Please Read Disclaimer