ఇదేం కెలుకుడు తాప్సీ..?

0

కంగనా.. ఆమె సోదరి రంగోలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎంతటోడైనా సరే.. వారి నోటికి భయపడాల్సిందే. ఇప్పుడు నడుస్తున్నదంతా నోరున్నోళ్లదే. తమకేమాత్రం తేడా అనిపించినా.. మొహమాటం లేకుండా మాటలతో కడిగేయటంలో కంగనా సిస్టర్స్ కున్న ప్రావీణ్యం అంతా ఇంతా కాదు. అందుకే.. వారి నోట్లో పడకూడదని చాలామంది సెలబ్రిటీలు అనుకుంటారని చెబుతారు.

మొన్నటికి మొన్నఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంపై కంగనా పెదవి విప్పకున్నా.. ఆమె సోదరి మాత్రం నోటికి పెద్ద ఎత్తున పని చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా అలియాభట్ ను ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. అలాంటి రంగోలి నోట్లో తన పేరు నానకపోవటం గౌరవంగా భావిస్తున్నట్లుగా చెప్పుకుంది తాప్సీ.

రంగోలి తన పేరును టచ్ చేయకపోవటానికి తాప్సీకి ఎందుకంత సంతోషం అంటారా? ఫిలింఫేర్ లో ఆమెకు కూడా ఒక అవార్డు వచ్చింది. తనకు అవార్డు వచ్చినా పట్టించుకోలేదంటే.. అది న్యాయంగా వచ్చిందని ఆమె భావించినట్లే కదా? అన్నట్లు తాప్సీ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే.. అలియాకు న్యాయంగా రాలేదనా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అయినా.. ఎవరో ఏదో అనలేదన్న దానికి ఆనందపడిపోవటం ఏమిటి? అదే సమయంలో వేరే వాళ్లను అన్నదానికి కూడా ఆమె హ్యీపీ అన్నట్లుగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. కెలుక్కొని మరీ వివాదంలోకి జారిపోవటం.. అందరి చేత మాట పడటం తాప్సీకి అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer