మరోసారి ట్రోలర్ల బారిన పడిన తాప్సీ

0

తాప్సీ పన్ను మొదట్లో తెలుగు సినిమాలతోనే పేరు తెచ్చుకున్నా ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. హిట్లు సాధిస్తూ హిందీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది. అయితే నటన విషయంలో మంచి పేరే ఉంది కానీ తాప్సీ అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు వివాదాస్పద కామెంట్లతో విమర్శకులకు ఛాన్స్ ఇస్తుంది. ఈమధ్య అలాంటి సంఘటనే జరిగింది.

ఈమధ్య ముంబైలో తాప్సీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక డిన్నర్ పార్టీ చేసుకుంది. పార్టీ టైమ్ ముగిసిన తర్వాత కారు దగ్గరకు వచ్చే సమయంలో అక్కడ వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. ఒక ఫోటోగ్రాఫర్ అయితే తాప్సీ కారు ఎక్కే లోపు ఫోటోలు తీయాలనే ఆతృతతో కెమెరా పట్టుకుని వేగంగా తాప్సీ వైపుకు పరుగు పెడుతూ వచ్చాడు. అది గమనించిన తాప్సీ ‘దయచేసి నా కారు కింద పడి చావొద్దు’ అంటూ ఒక సెటైర్ వేసింది. అయితే ఆ ఫోటోగ్రాఫర్ పెద్దగా పట్టించుకోకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు.

ఫోటోగ్రాఫర్ పరిగెడుతూ రావడం.. తాప్సీ పంచ్ వేయడం అంతా ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇలాంటి వీడియోలు ఏవి సోషల్ మీడియాలోకి వచ్చినా కామెంట్లు పడతాయి కదా. కొందరు నెటిజన్లు తాప్సీ అలా ఫోటోగ్రాఫర్ ను అనడం కరెక్ట్ కాదని అన్నారు. మీడియా పట్ల.. ఫోటోగ్రాఫర్ పట్ల గౌరవం చూపించాలని తాప్సీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఫోటోగ్రాఫర్ అతని డ్యూటీ చేస్తున్నాడని.. అది తాప్సీ మనసులో పెట్టుకోవాలని గట్టిగా విమర్శలు చేశారు.
Please Read Disclaimer