కుండ బద్దలు కొట్టేసిన తాప్సి

0

టాలీవుడ్ లో తాప్సిని రాఘవేంద్ర రావు హీరోయిన్ గా పరిచయం చేసిన విషయం తెల్సిందే. మంచు హీరో మనోజ్ సరసన ‘ఝుమ్మంది నాధం’ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటించింది. తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. స్టార్ హీరోయిన్ గా మాత్రం ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకోలేక పోయింది. టాలీవుడ్ లో ఈ అమ్మడు మంచి సినిమాలే చేసినా కూడా అదృష్టం బాగాలేక పోవడంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్ కు వెళ్లిన తాప్సి అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా గేమ్ ఓవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా తాప్సి తన కెరీర్ గురించి కుండ బద్దలు కొట్టినట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్ లో తనను ఎవరు కూడా గ్లామర్ పాత్రలో చూడాలనుకోవడం లేదు. గ్లామర్ పాత్రలో నటించాలని నేననుకున్నా కూడా ఎవరు నన్ను కమర్షియల్ పాత్రల కోసం ఎంపిక చేసుకోవడం లేదని తాప్సి వాపోయింది. తనను కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలకే తీసుకుంటున్నారు. కమర్షియల్ పాత్రలు చేసేందుకు బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఆఫర్లు నాకు రావడం లేదని నేనేం బాధపడను.

నాకు సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా ఏమీ రావడం లేదు. నాకు వస్తున్న ఒకటి రెండు ఆఫర్లు కూడా మంచి ఆఫర్లే అవ్వడంతో సెలక్ట్ చేసుకునే అవకాశం లేకుండానే మంచి పాత్రలు వస్తున్నాయి. నన్ను సంప్రదిస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సౌత్ లో నాకు చాలా తక్కువ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదంది. అయినా కూడా నటిగానే కొనసాగలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. పెళ్లి కావాలి.. పిల్లలు కావాలని అనిపిస్తుంది కాని ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినన్ని రోజులు నటిస్తూనే ఉంటాను అంది. ఇదే సమయంలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కెరీర్ ఆరంభం నుండి కూడా అడపా దడపా ఆఫర్లతోనే నెట్టుకు వస్తున్న తాప్సి ఇదే తరహాలో కెరీర్ కు స్వస్థి చెప్పాలి వస్తుందేమో..!
Please Read Disclaimer