ప్రేక్షకులకు డబల్ స్టాండర్డ్ అంటూ పంచ్!

0

తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు తాప్సీ పన్ను. మొదట టాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. ‘పింక్’.. ‘బద్లా’.. లాంటి హిట్ చిత్రాలతో తనకంటూ బాలీవుడ్లో మార్కెట్ సాధించింది. సినిమాల విషయంలోనే కాకుండా తన ఫ్రాంక్ టాక్ తో అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

కొన్నిరోజుల క్రితం ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ వంగా లవ్ డెఫినిషన్ పై సెటైర్ వేసి హాట్ టాపిక్ అయింది. అయితే ఆ కామెంట్ మిస్ ఫైర్ అయిందని చాలా కామెంట్లు వినిపించాయి. మరోవైపు బాలీవుడ్ లో సూర్యకాంతం సిస్టర్స్ ఉన్నారు కదా.. అదేనండీ కంగనా – రంగోలి జోడీ.. వారిపై ఇన్ డైరెక్ట్ గా భారీ పంచ్ వేసింది. అసలేం జరిగిందంటే.. ‘జడ్జిమెంటల్ హై క్యా’ ట్రైలర్ ను ప్రశంసిస్తూ తాప్సీ ఒక ట్వీట్ చేసింది. అయితే అందులో కంగనా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దీంతో రంగోలి ఒక గయ్యాళి తరహాలో “కంగనా ను నువ్వు కాపీ కొడుతుంటావు. నువ్వో కాపీ క్యాట్. అయినా కంగనా పేరు ప్రస్తావించకుండా ట్రైలర్ ను ఎలా పొగుడుతావు?” అంటూ ఒక వితండవాదం లాజిక్ వినిపించింది. ఈ విషయంపై రిపోర్టర్లు స్పందించమని కోరితే.. “వారి స్థాయికి నేను దిగజారలేను. అలాంటి వాటికి స్పందించి వారికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వదలుచుకోలేదు” అంటూ ఇండైరెక్ట్ సెటైర్ వేసింది.

“ఆడియన్స్ ‘కబీర్ సింగ్’ ను ఆదరించి సూపర్ హిట్ చేశారు.. అలానే లేడీ కబీర్ సింగ్ వస్తే ఆదరిస్తారా?” అని ప్రశ్నిస్తే “లేడీ కబీర్ సింగ్ కాదు కానీ లోపాలున్న ‘మన్మర్జియా’ రూమి పాత్రను ఇదే ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆడియన్స్ లో ఉండే డబల్ స్టాండర్డ్ ను మనం తప్పించుకోలేం”అంటూ ప్రేక్షకులపై కూడా ఒక పంచ్ వేసింది. పంచ్ వేస్తే వేసింది కానీ నిజమే కదా? కబీర్ సింగ్ చేసిన పనులన్నీ ఓ లేడీ కబీర్ సింగ్ చేస్తే యాక్సెప్ట్ చేసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు?
Please Read Disclaimer