స్టార్ హీరోల ఇరుకు మెంటాలిటీపై తాప్సీ లీక్స్

0

ఈగోల గోల ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. ఇక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో మగువలకు ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసినదే. అయితే దీనికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న నాయికగా తాప్సీ పన్నుకు చాలా పాపులారిటీ దక్కింది.

ఇంతకుముందు నందితా దాస్.. షబానా ఆజ్మీ.. ఆ తర్వాత తనూశ్రీ దత్తా.. సోనమ్ కపూర్ .. సోనాక్షి సిన్హా ఇలా కొందరు ఈ తరహాలో పేరు బడ్డారు. వీళ్ల తర్వాత మాత్రం తాప్సీ పన్ను పేరు మార్మోగుతోంది.

పురుషాధిక్యాన్ని ప్రశ్నిస్తూ తాప్సీ నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక హీరోగారు తన గొంతు నచ్చలేదని వేరే డబ్బింగ్ ఆర్టిస్టుతో కొన్ని పదాలు మార్పించేశారట. అలాగే ఒక స్టార్ హీరో భార్య తనని ఓ సినిమా నుంచి తప్పుకునేలా చేసిందని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఒక సినిమా ఫ్లాపైతే తన రెమ్యునరేషన్ కోయించేశాడట స్టార్ హీరో. ఇలాంటి అనుభవాలు కెరీర్ ఆరంభం లో ఎదురయ్యాయని తెలిపింది.

అప్పట్లో తనని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపైనే నోరు జారి బుక్కయిన సంగతి తెలిసిందే. ఈసారి తనతో పెట్టుకున్న హీరోలు తాప్సీకి ఎలాంటి కౌంటర్లు వేస్తారో అన్న చర్చా వాడి వేడిగా సాగుతోంది.