సైరా అదనపు షోలు.. ఠాగూర్ మధు హెల్ప్

0

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరోల సినిమాలన్నిటికీ అదనపు షోల ప్రదర్శనకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటారనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ ను రికవర్ చేసుకోవాలంటే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉండే మొదటి వారంలో అందనపు ఆటలను ప్రదర్శించడం తప్పనిసరి. అయితే ‘సైరా’ కు చివరి నిముషం వరకూ అదనపు షోల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అనుమతి రాకపోవడంతో మెగా క్యాంప్ లో టెన్షన్ నెలకొంది.

ఫైనల్ గా అనుమతులు రావడంతో సైరా బృందం ఊపిరి పీల్చుకున్నారు. దీని వెనుక మెగా ఫ్యామిలీ గట్టి ప్రయత్నాలే చేశారని సమాచారం. ముఖ్యంగా నిర్మాత ఠాగూర్ మధు మెగా ఫ్యామిలీ తరఫున ఈ విషయంలలో చొరవ తీసుకొని మరీ ప్రయత్నించారట. ప్రభుత్వంలో ఉన్న పరిచయాల ద్వారా అనుమతులు మంజూరు అయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించారట. మరో నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా ఈ విషయంలో తన వంతు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.

చివరి నిముషం వరకూ టెన్షన్ తప్పలేదు కానీ అదనపు ఆటల ప్రదర్శనకు అనుమతి లభించడంతో ఆంధ్రప్రదేశ్ లో ‘సైరా’ భారీ కలెక్షన్స్ నమోదు చేసేందుకు మార్గం సుగమం అయింది. ‘సైరా’ను దాదాపు రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారని తెలిసిందే. దీంతో అదనపు షోల వ్యవహారం గతంలో కంటే కీలకంగా మారింది.
Please Read Disclaimer