పవన్ కోసం హైదరాబాద్ లో తాజ్ మహల్!!

0

తెలుగు నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎప్పుడు కూడా వెనకాడరనే విషయం తెల్సిందే. బాలీవుడ్ సినిమాల మేకింగ్ ఖర్చు కంటే మన సినిమాల మేకింగ్ ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ ఏ రేంజ్ లో శృతి మించుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా క్వాలిటీ మరియు భారీతనం కోసం నిర్మాతలు ఏమాత్రం వెనుకాడే పరిస్థితి తెలుగు సినిమా పరిశ్రమలో కనిపించదు. అందుకే ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు చూస్తేంటే బాలీవుడ్ మూవీస్ కూడా వీటిముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ కు కూడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ ను పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశ్యంతో ఔట్ డోర్ షూటింగ్స్ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్ వేసి ఇండోర్ లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు వీధి సెట్లు మరియు కోర్టు సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చాలా స్పీడ్ గా పింక్ ను తీయాలనుకున్నా కూడా భారీ బడ్జెట్ నే దిల్ రాజు ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-