ఖైదీ దర్శకుడితో తలైవార్ 169 ఫిక్సయినట్టే

0

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు దర్బార్ విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. తమిళ్ సహా తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించిందన్న టాక్ వినిపించింది. గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ సినిమాలను రిలీజ్ చేస్తున్నా ఎన్నో నష్టాలను చవి చూసిన ఎన్.వి. ప్రసాద్ కు దర్బార్ సేఫ్ జోన్ సినిమాగా నిలిచిందట. ఓవరాల్ గా తమిళ వెర్షన్ బంపర్ హిట్ అవ్వడంతో 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందని ఇటీవలే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో చాలా కాలానికి సూపర్ స్టార్ కి సిసలైన సక్సెస్ దక్కినట్లు అయింది. సూపర్ స్టార్ సినిమా కెరీర్ చరమాంకంలో ఉండగా ఈ ఫలితం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇకపై రజనీ సినిమాలు తగ్గించి రాజకీయాలపైనా దృష్టి పెట్టనున్నారని సిగ్నల్స్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రణరంగంలోకి దిగే ముందే వీలైనన్ని సినిమాలు చేసి పుల్ స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారట.

యువ దర్శకుడు లోకష్ కనకరాజ్ తో ఓ సినిమా చేయడానికి రజనీ ఇప్పటికే కమిటైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఖైదీ సినిమాతో లోకేష్ కనగరాజ్ పేరు తమిళ్ సహా తెలుగు నాటా బాగా పాపులర్ అయింది. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా ఇరు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఖైదీ ఇన్నోవేటివ్ మేకింగ్ స్టైల్ వల్ల దర్శకుడికి మంచి పేరొచ్చింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా ఆద్యంతం రంజుగా చూపించడంలో లోకేష్ పెద్ద సక్సెసయ్యాడు. లోకేష్ స్టైల్ రజనీ కి పిచ్చిగా నచ్చేసి అవకాశం ఇచ్చారట.

పా.రంజిత్ తో వరుస సినిమాలు చేసిన రజనీ అటుపై లోకేష్ పైనా అంతే ఇదిగా దృష్టి సారించారట. ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తానని ప్రకటించి మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ ఇలయదళపతి విజయ్ తో `మాస్టర్` అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ గ్యాప్ లో రజనీ `వివేగం` దర్శకుడు శివతో సినిమాని పూర్తి చేస్తారు. అనంతరం రజనీ- లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వీలైనంత వరకూ ఈ ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా ప్రారంభిచాలనే ఆలోచన చేస్తున్నారుట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో త్వరలోనే రానుందని తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-