అనుపమ డేరింగ్ గా ఆ విషయాన్ని ఒప్పుకుంది

0

సెలబ్రెటీలు చాలా మంది తాము మూడ నమ్మకాలను నమ్మము.. మంచి రోజులు చెడ్డ రోజులు ఏంటీ అన్ని మంచి రోజులే కదా అంటూ మాటలు చెబుతూ ఉంటారు. ఈ కంప్యూటర్ కాలంలో కూడా అష్టమి రోజు అలా చేయకూడదు.. రాహు కాలంలో ఇలా ఉండకూడదు అంటూ ఉండటం ఏంటీ అంటూ చాలా మంది సెలబ్రెటీలు అంటూ ఉంటారు. ఆన్ స్క్రీన్.. లేదా మీడియా ముందు అలాంటివి మూడ నమ్మకాలు అంటూ కొట్టి పారేసే సెలబ్రెటీు ఆఫ్ స్క్రీన్ మాత్రం వాటిని ఖచ్చితంగా పాటిస్తారు.

ఎక్కువ శాతం మంది సెలబ్రెటీలు వాటిని పాటించినా కూడా పాటించనట్లు గా కలరింగ్ ఇస్తూ ఉంటారు. కాని అనుపమ పరమేశ్వరన్ మాత్రం అలా కాదు. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్దలు చెప్పిన రాహు కాలం.. అష్టమి.. అమావాస్య కాలాల్లో తాను ఏ పని చేయను అంది. పెద్దలు మన మంచికే చెప్పారని నేను అనుకుంటాను. వారు చెప్పినట్లుగా ఫాలో అయితే తప్పేముంది. వారి మార్గంలో నడిస్తే జీవితం సాఫీగా సాగుతుందనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

ఇంతగా తిథులను నమ్మే అనుపమ పరమేశ్వరన్ ఎందుకు ఇంకా కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమె ప్రాంక్ నెస్ ను అభినందిస్తున్నారు. ఇలాంటివి నమ్ముతాను అంటూ చాలా మంది సెలబ్రెటీలు చెప్పుకోలేరు. కాని అనుపమ మాత్రం తాను నమ్ముతున్న విషయాలను నమ్ముతున్నట్లుగా చెప్పిందంటూ ఆమె అభిమానులు అంటున్నారు.

ప్రస్తుతం తమిళం మరియు మలయాళంలో ఒక్కో సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ ఏడాది అయినా ఈమెకు కమర్షిల్ గా బ్రేక్ లభిస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-